సంగీత దర్శకుడిగా ఇప్పుడు తమన్ మంచి జోష్ లో ఉన్నాడు. ప్రతి ఒక సంగీత దర్శకుడికి ఒక టైం వస్తుంది అన్నట్లు ఇప్పుడు తమన్ టైం ఇండస్ట్రీలో కొనసాగుతుంది. ఆయన పట్టిందల్లా బంగారం అయిపోతుంది. చేసిన సినిమాఅల్లా సూపర్ హిట్ అయిపోతుంది. అందుకే ఆయనకు రోజురోజుకు డిమాండ్ ఎక్కువైపోతుంది. ప్రస్తుతం ఆయన చేతిలో టాప్ హీరోల అందరి సినిమాలు ఉన్నాయి. ఏ హీరోకి తగ్గట్లు ఆ హీరో కి సంగీతాన్ని అందిస్తు మంచి వేరియేషన్స్ చూపిస్తూ నెంబర్ వన్ సంగీత దర్శకుడిగా ముందుకు దూసుకు పోతున్నాడు.

ఇక ఆయన సంగీత సారధ్యంలో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ చిత్రం. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో పాటు తనకి కూడా భారీగా పేరు వచ్చింది. సినిమాలోని పాటలు కొంతవరకే ప్రేక్షకులను ఆకట్టుకున్న కూడా నేపథ్య సంగీతం గురించి ప్రతి ఒక్కరు చెప్పుకుంటున్నారు అంటే ఏ రేంజ్ లో ఈ సినిమాకి నేపథ్య సంగీతాన్ని అందించాడో అర్థం చేసుకోవచ్చు. భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించిన బోయపాటి శ్రీను నేపధ్య సంగీతం విషయంలో పూర్తి స్వేచ్ఛ ఇచ్చి ఇంతటి అవుట్ పుట్ ను రాబట్టుకుందని  చిత్ర యూనిట్ చెబుతుంది.

వారి నమ్మకాన్ని నిలబెడుతూ తమన్ తన అనుభవాన్ని ఉపయోగించి ఈ చిత్రానికి భారీ స్థాయిలో నేపథ్య సంగీతాన్ని అందించాడు. ముఖ్యంగా బాలకృష్ణ శివ తాండవం చేస్తూ సీన్ లో నటిస్తుంటే ఆ సమయంలో తమన్ తెరవెనుక శివ తాండవం చేశాడని చెప్పవచ్చు. సినిమా ఆద్యంతం హై రేంజ్ లో సంగీతాన్ని అందించి ఇప్పటి వరకు తెలుగు సినిమా పరిశ్రమలో ఏ సంగీత దర్శకుడు అందించని విధంగా మ్యూజిక్ అందించాడు అన్న పేరును దక్కించుకున్నాడు. ఇక యాక్షన్ సీన్స్ లో తమన్ అందించిన సంగీతానికి ప్రేక్షకులు కేకలు వేస్తున్నారంటే తమన్ సంగీతం లో అవి కూడా ఎంత చిన్న పోయాయో చెప్పవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: