దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న చిత్రం 'రౌద్రం రణం రుదిరం'. టాలీవుడ్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మొదటి సారి కలిసి నటిస్తున్నారు. సుమారు 450 కోట్ల భారీ బడ్జెట్ తో ఫ్యాన్ ఇండియా స్థాయిలో తో రూపొందుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో కనిపించనున్నారు. ఇక చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ ఈ సినిమాతో టాలీవుడ్కి తెరంగేట్రం చేయనుంది. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ సినిమా కొన్ని అనివార్య కారణాల వల్ల పలుమార్లు వాయిదా పడింది.

 ఎట్టకేలకు ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకొని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.ఇక విడుదల సమయం దగ్గర పడటంతో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది ఈ చిత్ర యూనిట్. ఈ క్రమంలోనే ఇటీవల బ్లూగ్లిమ్స్ వీడియో తో పాటు నాటు నాటు అనే పాటను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ రెండు అప్ డేట్స్ కూడా ఆడియెన్స్ ను విపరీతంగా ఆకట్టుకొని సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. ఇక తాజాగా విడుదలైన ఆర్ఆర్ ఆర్ ఆంథెమ్ జనని పాట కూడా మంచి రెస్పాన్స్ ని అందుకుంది. ఇక ఈ సినిమా థియేటర్ ట్రైలర్ కోసం ఆడియన్స్ ఎంత ఎదురు చూస్తున్నారో చెప్పనక్కర్లేదు.

ఈ క్రమంలోనే సినిమా థియేట్రికల్ ట్రైలర్ను డిసెంబర్ 3వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. కానీ ఇటీవల ప్రముఖ గేయ రచయిత సిరివెన్నల సీతారామ శాస్త్రి గారి అకాల మరణం మరియు ఇతర అనివార్య కారణాలతో ఈ సినిమా ట్రైలర్ ని వాయిదా వేశారు. ఇక ఇప్పుడు తాజాగా ఆర్ఆర్ ట్రైలర్ కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించారు. డిసెంబర్ 9వ తేదీన ఆర్ఆర్ థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేయబోతున్నట్లు తాజాగా చిత్ర బృందం స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ పోస్టర్ని విడుదల చేస్తూ అధికారికంగా ఈ విషయాన్ని తెలియ జేసింది. దీంతో ఈ ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ ట్రైలర్ విడుదలైన తర్వాత ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

RRR