టాలీవుడ్ సీనియర్ ఊర మాస్ హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం 'అఖండ'.ఈ సినిమాని మిర్యాల రవీందర్ రెడ్డి తన 'ద్వారకా క్రియేషన్స్' బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు.ఈ కాంబినేషన్ కూడా 'సింహా' ఇంకా అలాగే 'లెజెండ్' వంటి బ్లాక్ బస్టర్ కాంబినేషన్ కావడంతో డిసెంబర్ 2 వ తేదీన విడుదలైన ఈ సినిమాపై ఇప్పటికీ భారీ అంచనాలు నెలకొన్నాయి. దాంతో మొదటి షోతోనే ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకోని దూసుకుపోతుంది.ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్లు చాలా తక్కువగా ఉన్నప్పటికీ.. ఈ సినిమా మంచి భారీ వసూళ్ళనే నమోదు చేస్తోంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా మంచి భారీ వసూళ్ళని నమోదు చేస్తుండడం విశేషం.

సాధారణంగా మాస్ సినిమాలు చూడడానికి ఓవర్ సీస్ లో జనాలు అంతగా ఇంట్రెస్ట్ చూపించరు. పవన్ కళ్యాణ్ ఇంకా మహేష్ బాబు లాంటి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ వున్న హీరోలు నటిస్తే తప్ప. అలాంటిది 'అఖండ' వంటి ఊర మాస్ చిత్రం ప్రీమియర్స్ తోనే ఏకంగా 'వకీల్ సాబ్' సినిమా రికార్డుని బ్రేక్ చేసింది.ఇక ఇప్పటి వరకు కూడా ఈ సినిమా అక్కడ $550K డాలర్లను వసూల్ చేసి..విజయవంతంగా దూసుకుపోతుంది.ఇక అన్నీ అనుకున్నట్టు కనుక జరిగితే ఈ సినిమా అక్కడ 1 మిలియన్ మార్క్ ను కూడా చాలా అందుకునే అవకాశం ఉంది. ఇక 'గౌతమీ పుత్ర శాతకర్ణి' తప్ప ఓవర్సీస్లో బాలయ్య సినిమాకి 1 మిలియన్ చిత్రం ఏది లేదు. మరి బాలకృష్ణ నటించిన ఈ ఊర మాస్ ఎంటర్ టైనర్ 'అఖండ' సినిమాసినిమా రికార్డులని బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: