నాగార్జున హీరో గా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం లో తెరకెక్కుతున్న సినిమా బంగార్రాజు,  ఈ సినిమా లో నాగార్జున సరసన రమ్యకృష్ణ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో మరో ముఖ్య పాత్ర లో  అక్కినేని నాగ చైతన్య కూడా నటిస్తున్నాడు, ఈ సినిమా లో అక్కినేని నా గచైతన్య సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి కొన్ని పోస్టర్ లను, ఒక పాట ను చిత్ర బృందం విడుదల చేయక వీటికి జనాల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే జనాలలో మంచి అంచనాలు కలిగి ఉన్న బంగార్రాజు సినిమా 2016 సంక్రాంతి కానుకగా విడుదల అయిన సోగ్గాడే చిన్నినాయన సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతోంది.

అయితే ఇప్పటికే కొన్ని పోస్టర్ లతో, ఒక పాట తో సినిమా పై మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ చిత్ర బృందం తాజా గా మరో సాంగ్ ను విడుదల విడుదల చేయబోతోంది. తాజా గా ఈ సాంగ్ విడుదల చేసే  తేదీని, సమయాన్ని తెలిపేందుకు చిత్ర బృందం ఒక పోస్టర్ విడుదల చేసింది. నా కోసం అంటూ సాగే  పాటను 5 డిసెంబర్ సాయంత్రం ఐదు గంటల 12 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం తాజా గా విడుదల చేసిన పోస్టర్ ద్వారా తెలియజేసింది. ఈ సినిమా ను సంక్రాంతి కానుక గా విడుదల చేయాలనే ఆలోచన లో చిత్ర బృందం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి, దానికి ప్రధాన కారణం ఇప్పటికే సోగ్గాడే చిన్నినాయన సినిమా సంక్రాంతి కానుక గా విడుదలై బ్లాక్ బస్టర్ అవడమే, అదే సెంటిమెంట్ తో సోగ్గాడే చిన్నినాయనా సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న బంగార్రాజు సినిమాలు కూడా సంక్రాంతి కి విడుదల చేయాలనే ఆలోచన లో చిత్ర బృందం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు మాత్రం ఈ సినిమా విడుదల తేదీని చిత్రబృందం  ప్రకటించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: