నటసింహం నందమూరి బాలకృష్ణ ఇటీవల నటించిన బ్లాక్ బస్టర్ సినిమా అఖండ. బోయపాటి దర్శకత్వం వహించిన సూపర్ హిట్ సినిమా డిసెంబర్ 2వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. బాలకృష్ణ నటించిన సింహ లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల తర్వాత నందమూరి బాలకృష్ణ నటించిన బాలయ్య బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కిన హిట్ సినిమా ఇదే కావడం విశేషం. అఖండ సినిమాలో బాలయ్య రెండు వేర్వేరు పాత్రల్లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సినిమాలో ఒక పాత్ర లో ఘోరగా బాలకృష్ణ ప్రేక్షకులందరికీ విజువల్ ట్రీట్ ఇచ్చారు.

 బాలయ్యకు జోడీగా ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ తన అందంతో నటనతో బాలయ్యకు ఏమాత్రం తగ్గకుండా నటించారు. ఇకపోతే శ్రీకాంత్ తనదైన విలనిజంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. శ్రీకాంత్ తో పాటుగా  జగపతి బాబు నటన కూడా ఎంతో ఆసక్తికరంగా ఉంది.ఇక తమన్ మ్యూజిక్‌ సినిమాలో ఎంతో అద్భుతంగా ఉంది.మిర్యాల రవీందర్ రెడ్డి,ద్వారక క్రియేషన్స్ పై  ఎవరి ఊహలకు అందని విధంగా సినిమాను నిర్మించారు. సూపర్ హిట్ అందుకున్న ఈ చిత్రం ఓటీటీ రైట్స్ హక్కులను ఎవరు దక్కించుకున్నారు అనేదానిపై సోషల్ మీడియా లో గట్టిగా చర్చలు జరుగుతున్నాయి.

 బాలకృష్ణ నటించిన అఖండ సినిమా ఓటిటి హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ దక్కించుకుందని తెలుస్తుంది.  అయితే భారీ బడ్జెట్ తోనే ప్రముఖ సంస్థ డిస్ని ప్లస్ హాట్ స్టార్ ఈ సినిమాను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమాతో హాట్ స్టార్ కచ్చితంగా జాక్ పాట్ కొట్టినట్లే... సినిమా విడుదల రెండు రోజులు పూర్తి చేసుకున్న అఖండ సినిమా కలెక్షన్ల పరంగా కూడా దూసుకుపోతుంది. అయితే బాలకృష్ణ నటించిన ఈ సినిమా ఓ టి టి లో రావడానికి ఇంకా చాలా సమయం పడుతుంది. అయినా సరే నెటిజన్లు మాత్రం సినిమా బాగుండడంతో విషయంపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: