ప్రస్తుతం ఎన్టీఆర్ రామ్ చరణ్ లతో కలిసి రాజమౌళి తీస్తున్న పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్. మెగా, నందమూరి ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ఆడియన్స్ లో కూడా భారీ స్థాయి అంచనాలు ఏర్పరిచిన ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం గా అలానే రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా ఇటీవల ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసిన యూనిట్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్స్ అన్ని కూడా మూవీ పై భారీ స్థాయి లో అంచనాలు క్రియేట్ చేయగా ఈ సినిమాని వచ్చే ఏడాది జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా ఎంతో భారీ ఎత్తున విడుదల చేయనుంది యూనిట్. మరి తొలిసారిగా ఎన్టీఆర్, చరణ్ కలిసి నటిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా ఎంత మేర సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

అయితే విషయం ఏమిటంటే ఈ సినిమా పోస్టర్స్ రిలీజ్ అయిన తరువాత నుండి పలువురు స్టార్ హీరోలని ఆర్ఆర్ఆర్ పోస్టర్స్ మాదిరిగా ఎడిట్ చేస్తున్న ఇతర హీరోల ఫ్యాన్స్ ప్రస్తుతం ఒక పిక్ ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, రెబల్ స్టార్ ప్రభాస్ ఇద్దరూ కూడా ఆర్ఆర్ఆర్ లోని చరణ్, ఎన్టీఆర్ లుక్స్ మాదిరిగా ఎడిట్ చేసిన పిక్ ప్రస్తుతం ఎంతో వైరల్ అవుతోంది. నిజంగా అది చూసిన పలువురు ప్రేక్షకాభిమానులు పులకరించిపోతుండగా భవిష్యత్తులో ఆ ఇద్దరు హీరోల కాంబినేషన్ లో ఒక మల్టీస్టారర్ సినిమా వస్తే చూడాలని పలువురు కోరుతున్నారు. మరి అది ఎంతవరకు సాధ్యపడుతుందో, ఏ డైరెక్టర్ వీరిద్దరి కాంబో ని సెట్ చేస్తారో తెలియాలి అంటే దానికి కాలమే సమాధానం చెప్పాలని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: