తమిళనాడు ముఖ్యమంత్రిగా పని చేసిన దివంగత నేత జయలలిత వర్ధంతి నేడు. ఈ సందర్భంగా దేశం ఆమెను స్మరించుకుంటుంది. రాజకీయ నాయకుల నుంచి సినీ తారల వరకు ఈ రోజు తమిళనాడు అమ్మగా పిలుచుకునే జయలలితకు నివాళులర్పిస్తున్నారు. ఆమె 2016 లో గుండె పోటుతో ఈ రోజు అంటే డిసెంబర్ 5న అనారోగ్యం కారణంగా మరణించారు. తమిళనాడు రాజకీయాల్లో ఆమెను అమ్మగా పిలుస్తారు. జయలలిత 1948 ఫిబ్రవరి 24న జన్మించారు. రాజకీయాలతో పాటు సౌత్ సినిమాల్లోనూ జయలలిత తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు.

మీడియా కథనాల ప్రకారం జయలలిత జన్మించినప్పుడు ఆమెకు తన అమ్మమ్మ కోమల వల్లి అనే పేరు పెట్టిందట. ఆ తర్వాత ఆమె సినిమాల్లోకి వచ్చాక జయలలితగా పేరు మార్చుకున్నారు. సినిమాల్లోకి రాక ముందు జయలలిత చెన్నై లో శాస్త్రీయ సంగీతం, వెస్ట్రన్ క్లాసికల్ పియానో, అనేక రకాల నృత్యాలను కూడా అభ్యసించారు. సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా తెలుగు, తమిళ భాషల్లో హీరోలందరి సరసన నటించి సత్తా చాటిన ఆమె రాజకీయాల్లో మాత్రం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. తన రాజకీయ జీవితంలో 6 సార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు.  

ఎంజీఆర్‌ రాజకీయ గురువు
దక్షిణాదికి చెందిన ప్రముఖ సూపర్‌ స్టార్ ఎంజీఆర్‌ ని జయలలిత తన గురువుగా భావిస్తారని అందరికీ తెలిసిన విషయమే. జయలలిత ఆయనతో కలిసి 28 సినిమాల్లో చేశారు. ఆమె 1980లో తన చివరి తమిళ చిత్రం 'తేడి వంద కదల'లో నటిగా కన్పించింది.

వివాదాలతో జయలలలిత ముడి
జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల పై అప్పట్లో వివాదం నెలకొంది. 1996 లో ముఖ్యమంత్రిగా ఐదేళ్లు పూర్తయిన తర్వాత జయలలిత ఎన్నికలకు సిద్ధమవుతున్న సమయంలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆమెపై 48 కేసులు నమోదై జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఆమె ఇంటి పై సీబీఐ దాడులు చేయగా 10,500 ఖరీదైన చీరలు దొరికాయి. దీంతో పాటు ఈ సోదాలో నగలు కూడా లభ్యమయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: