సినిమా  హీరోల‌కు ప్రతి ఒక్కరికి ఒక ఇష్టమైన ఆహారం ఉంటుంది. అయితే వారి బిజీ షెడ్యూల్ నేప‌థ్యంలో ప్రతిరోజు ఆ ఇష్టమైన ఆహారాన్ని తినడానికి వీలు పడదు కాబట్టి ఎప్పుడైనా తమకు నచ్చిన ఆహారాన్ని తినాల‌నిపిస్తే ప్రత్యేకంగా తమకు నచ్చిన వారితో వడ్డించుకొని మరీ తిన‌డం వారికి చాలా హాబీ.  ఈ విషయం సెలబ్రిటీల కైనా, సామాన్యుల‌కు అయినా వ‌రిస్తుంది. ఇక ఆంధ్రప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, దివంగ‌త నందమూరి తారక రామారావు ఎంత గా గుర్తింపు పొందారో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏ విషయంలోనైనా సరే జాగ్రత్తగా ఉండమని చెప్పే నందమూరి తారకరామారావు ఆహారం విషయంలో మాత్రం తప్పనిసరిగా కచ్చితంగా జాగ్రత్తలు పాటించాలని ప్రతి ఒక్కరికి చెబుతూ ఉండేవారట.

ఇటీవల నందమూరి తారకరామారావు గురించి ప్రముఖ సీనియర్ హీరోయిన్ అలాగే క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు పొందిన లక్ష్మి కొన్ని ఆశక్తికర విషయాలను వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ.. సీనియర్ ఎన్టీఆర్ వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని చాలా గౌరవంగా పిలిచి మరి మాట్లాడేవారు.. అయితే ఒక రోజు నేను సగం దోసె మాత్రమే తిని వెళ్ళిపోతుండగా .. ఆయన ఆహారాన్ని చూసి..నేను  వృధా చేయడం చూసి.. ఏవండీ లక్ష్మి గారు మీరు ఇటు రండి.. అని, ఈ వయసులో ఏం తిన్నా అరిగిపోయే శక్తి ఉన్నప్పుడు ఇలా సగం దోస ని తిని వదిలిపెట్టడం ఎందుకు అంటూ నా పై సీరియస్ అయ్యారు అని ఆమె చెప్పుకొచ్చింది..

వయసులో ఉన్నప్పుడు.. జీర్ణించుకునే శక్తి ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కడుపునిండా తినాలి, రోజు వ్యాయామం చేయాలి..తప్ప ఇలా ఆహారాన్ని వృధా చేయకూడదు..మనం ఆరోగ్యాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో.. మనం కూడా ఎక్కువ కాలం జీవిస్తాము అంటూ ఎన్టీఆర్ ఆమెతో చెప్పినట్లు ఆమె తెలిపింది.. స్టార్ హీరోయిన్ అనే   పేరు తెచ్చుకోవాలి అని లక్ష్మితో ఎన్టీఆర్ చెప్పారట. ఎవరైనా తప్పు చేస్తే చాలా సున్నితంగా మందలించే వారు అని ఆమె తెలిపింది.

ఎన్టీఆర్ తినే ఆహారం గురించి ఆమె మాట్లాడుతూ ..సీనియర్ ఎన్టీఆర్ తను తినే ఆహారాన్ని ప్రతిరోజు ఇంటి నుంచి తెప్పించుకొని తినేవారు. తినే ఆహారంలో ప్రతిరోజూ దోసెలు , పూరీలు ,హల్వ ఆపిల్ జ్యూస్ సీసాలు ,కారప్పూస కచ్చితంగా ఉండాల్సిందే . ఈ విషయంలో ఆయన చాలా పర్ఫెక్ట్ గా ఉండేవారు. ఇవి లేనిదే ఏ రోజు కూడా భోజనం చేసింది లేదు అంటూ ఆమె తెలిపింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: