బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్ హీరో, హీరోయిన్ లుగా రూపుదిద్దుకున్న భారీ బడ్జెట్ చిత్రం 'అఖండ'. ఈ చిత్రాన్ని 'ద్వారకా క్రియేషన్స్' బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమా మొదట రిలీజ్ అయినప్పుడు సక్సెస్ అవుతుందని అంతా అనుకున్నారు, హిట్ కొడుతుందని ఎక్సపెక్ట్ చేశారు. కానీ ఈ సినిమా ఇపుడు వారి అంచనాలకు మించి పరుగులు మాత్రమే కాదు వాయు వేగంతో దూసుకుపోతుంది. బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను తెచ్చుకుని నందమూరి అభిమానుల్నే కాదు మిగిలిన ఆడియన్స్ ని థియేటర్ల వద్ద క్యూలు కట్టేలా చేస్తోంది. ఈ స్పీడు చూసి ఈ సినిమా రికార్డులు తిరిగి రాయడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు.

మరి ఇంతటి ఘన విజయానికి కారణం ముఖ్యంగా ఫైట్స్ మరియు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అని చెప్పొచ్చు. ఫైట్స్ జరుగుతున్న సమయంలో తమన్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ అబ్బా ఆ సౌండ్ కే గూస్ బమ్స్ వచ్చేస్తాయి. సునామీ పరుగులు తీస్తున్న ఫీలింగ్ వస్తుంది.  అఘోరగా బాలయ్య ఎంట్రీ సీన్ నుండి క్లైమాక్స్ వరకు ఎన్నో ఎలివేషన్ లు ఫైట్ లు ఉన్నాయి. కాగా అన్ని ఫైట్స్  ప్రేక్షకులను కళ్ళు తిప్పుకోకుండా చేస్తున్నాయి. అయిన బాలయ్య ఈ  వయసులో ఆ ఫైట్స్, ఆ డ్యాన్స్ అంటే 'బాబోయ్ బాలయ్య  బాబు తోపు' అంటున్నారు అభిమానులు. అలా ఈ సినిమా మొదట అనుకున్న అంచనా లెక్కలను మించిన రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటోంది అఖండ మూవీ.

ఇక ఈ చిత్రంలో ప్రత్యేకంగా పూర్ణ పాత్రకు అభిమానులు నీరాజనాలు పలుకుతున్నారు. సినిమా సినిమాకి వైవిధ్యాన్ని కనబరుస్తూ పూర్ణ తన నట విశ్వరూపాన్ని చూపిస్తున్నారు అంటూ ప్రశంసలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఉన్నంతలో తన పాత్ర లో ఒదిగిపోయిందని ప్రేక్షకులు అంటున్నారు. భవిష్యత్తులో ఈమెకు మరిన్ని మంచి అవకాశాలు వస్తాయని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: