మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో నందమూరి నటసింహం నటించిన మూడో చిత్రం 'అఖండ'. ప్రేక్షకులను ఎంతగానో ఊరించిన ఈ చిత్రం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సినిమా అంచనాలకు మించిన ఆదరణ అందుకుంటోంది అనడంలో సందేహం లేదు. సినిమా చూసిన ప్రతి ఒక్కరు బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ బాలయ్యకు జేజేలు పలుకుతున్నారు. అబ్బబ్బా.... ఏమి యాక్షన్... ఏమి ఫైట్స్... ఏమి డైలాగ్స్... ఏమి పాత్రల తీరు... మాటల్లో చెప్పలేం అండి వచ్చి సినిమా చూసేయండి అంతే అంటున్నారు సినిమా చూసిన ప్రేక్షకులు. ఎటు చూసినా రికార్డు స్థాయిలో ఈ సినిమా పేరు మార్మోగిపోతోంది.

ఇక బాలయ్య హీరోయిజంకు జేజేలు, శ్రీకాంత్ విలనిజంకు హేట్సాఫ్ లతో పాటు పూర్ణ యాక్టింగ్ కి ఫిదా మేము అంటున్నారు ఆడియన్స్. ఈ సినిమాలో కలెక్టర్ ఆఫీస్ లో అంత సిన్సియర్ గా పనిచేసే మహిళ కనిపించిన పూర్ణ పాత్ర ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తోంది.  మంచి పాత్ర పడాలే కానీ పూర్ణ పర్ఫార్మెన్స్ పీక్స్ లో ఉంటుంది అనడానికి ఈ సినిమా మరో నిదర్శనం అంటున్నారు. మొత్తానికి పూర్ణ పాత్ర ఈ చిత్రానికి ఒక హైలెట్ గా నిలిచింది అంటూ  సర్వత్రా ప్రశంసల వర్షాలు కురుస్తున్నాయి.

సాధారణంగా సినిమా అనుకున్న దానికన్నా పెద్ద సక్సెస్ అయితే ఆ చిత్ర విజయానికి ముఖ్య కారకులు అయిన వారికి మేకర్స్ మంచి బహుమతులు ఇస్తుంటారు. ఇదే తరహాలో ఇపుడు పాత్రకు వస్తున్న రెస్పాన్స్ చూసి ఆమెకు భారీ మొత్తం లో ఒక గిఫ్ట్ ఇవ్వాలని యోచిస్తున్నారట మేకర్స్. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీ నుండి గట్టిగానే వినిపిస్తోంది. పూర్ణకు మేకర్స్ నుండి ఓ సర్ ప్రైజింగ్ గిఫ్ట్ అందబోతుంది అంటూ వార్తలు వినపడుతున్నాయి. మరి ఇంతకీ గిఫ్ట్ నిజమేనా...ఏమిటా గిఫ్ట్ అంటే కాస్త వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: