ప్రస్తుతం టాప్ డైరెక్టర్స్ , బడా ప్రోడ్యూసర్స్ , స్టార్ హీరోలు అందరికి కావాల్సింది ఈ హీరోయిన్ నే. అంతలా ఆమె తన నటనతో మాయ చేసింది. ఒక్కప్పుడు ఐరెన్ లెగ్ అన్నుకున్న వాళ్ళే ఇప్పుడు అమ్మడు డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారంటే..పూజా టైం ఎంత మారిపోయిందో మనం అర్ధం చేసుకోవచ్చు. వరుస పాన్ ఇండియా మూవీలు చేస్తూ దూసుకుపోతున్న పూజా స్పీడ్ అందుకోవడం మిగతా హీరోయిన్ లకు ఇప్పట్లో సాధ్యం కాదనే చెప్పాలి. రెమ్యూనరేషన్ పరంగా కూడా అమ్మడు టాప్ లోనే ఉంది. దీంతో పూజా ఫుల్ డిమాండింగ్ హీరోయిన్ గా మారిపోయింది.

ఇక తాజాగా ఓ ఇంటర్వ్యుల్లో మాట్లాడుతూ పూజా హెగ్డే తన కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను అభిమానులతో పంచుకుంది. ముఖ్యంగా ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ గా ఉన్నానని.. అయితే ఇలాంటి టైంలోనే ఆమెకు మంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయని..కానీ డేట్స్ సర్దుబాటు చేయలేక ఇబ్బందులు పడుతున్నాని చెప్పుకొచ్చింది. ఇంకా పూజా మాట్లాడుతూ.." కొందరు డైరెక్టర్స్  నా దగ్గరకు వచ్చి వాళ్ల సినిమాలో నాకోసం ఈ పాత్ర స్పెషల్ గా డిజైన్ చేసారని చెప్పుతుంటే..అలాంటి సినిమాలకు డేట్స్ ఇవ్వలేకపోతున్నానే అని బాధపడుతాను. నన్ను నమ్మి ఓ పాత్ర ఇస్తే దానికి 100 % న్యాయం చేస్తా. ఆ విషయం నాతో పని చేసిన ప్రతి డైరెక్టర్ కి, ప్రోడ్యూసర్ కి తెలుసు" అంటూ క్లారిటీ ఇచ్చింది ఈ బుట్టబొమ్మ.

ఇక పెళ్లి గురించి మాట్లాడుతూ.." నా పెళ్ళికి ఇంకా బోలెడంత టైం ఉంది. ఇప్పట్లో అయితే ఖచ్చితంగా చేసుకోను. అయినా మన పెద్ద వాళ్లు అంటారు గా "ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు’ అని.. ఈ మధ్యనే  ఇల్లు కట్టుకున్న అప్పుడే అర్ధమైంది ఇల్లు కట్టుకోవడం ఎంత కష్టమో. ఇక పెళ్లి అంటే ఎలా ఉంటుందో..అంటూ నవ్వుతూ...నేను నా లైఫ్ లో ఎప్పుడు ఒక్కటే నమ్ముతాను వీళ్లతో నా జీవితం హ్యాపీగా ఉంటుంది అని నాకు అనిపిస్తేనే పెళ్లి చేసుకుంటా. లేకపోతే అసలు చేసుకోను"..అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈ మాటలు విన్న ఫ్యాన్స్ " ఏంటమ్మ పూజా..నీకు అలా అనిపించేవరకు పెళ్లి చేసుకోవా..? అంటూ కామెంట్స్ చేస్తుంటే..మరికొందరు "ఏం మాట్లాడుతున్నావ్..పూజా నీ పెళ్లి కోసం మేం వెయిటింగ్" అంటూ ఫన్నీ గా రిప్లై ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: