24-12-1987 జయలలిత రాజకీయ గురువు అత్యంత ఆత్మీయడు mgr మరణించడం జరిగింది. ఈ వార్త వినగానే జయలలిత షాక్ కి గురయ్యింది. ఆ వార్త విన్న తర్వాత కొద్ది సేపటికి తేరుకుని.. ఎంజీఆర్ ఇంటికి బయలుదేరింది. ఇక ఆమె తన ఇంటి వద్దకు వెళ్లగానే.. అక్కడున్న కొంత మంది ఆమెను రావద్దని హెచ్చరించారట. అంతేకాదు ఆమె కారులో ఉండగానే దిగకుండా కొంతమంది అడ్డుపడ్డారట. అయితే ఆ తర్వాత కారు అద్దాలు బద్దలు కొట్టుకొని బయటికి రావడం జరిగిందట. అయితే అక్కడున్న వారంతా ఎంజీఆర్ మృతదేహం..ఎక్కడుందో చెప్పలేదట.

అక్కడున్నవారంతా mgr కడచూపు కూడా దక్కకుండా చేయాలని చూశారట. కానీ చిట్టచివరికి ఎవరో mgr మృతదేహాన్ని రాజాజిమహల్ కి తరలించారని వార్త తెలియగానే ఆమె అక్కడికి హుటాహుటిగా వెళ్లిపోయిందట. అలా mgr మృతదేహం వద్ద తల భాగాన నిల్చొని ఉంది జయలలిత. కనురెప్పలు సైతం వాల్చకుండా అక్కడే 21 గంటలపాటు ఉన్నదట.MGR కూ నివాళులర్పించడానికి వచ్చిన వారందరూ ఆమె పట్టుదల చూసి ఆశ్చర్యపోయారు.

అయితే ఇంత దృఢంగా ఉండే ఆమెకు జరిగిన అవమానం అంతా ఇంతా కాదు. mgr భార్య రామచంద్రన్ మద్దతుదారులు జయ లలిత చుట్టుపక్కలే ఉంటూ ఆమెను కాళ్లతో తొక్కారట.వెనుకనుంచి గోర్లతో గిచ్చారట. అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు శతవిధాలా ప్రయత్నించారట. అయినా కూడా జయలలిత చెక్కుచెదరకుండా అక్కడే ఉన్నట్లు సమాచారం.


ఆమెను ఎంతగానో అవమానించినా ఉన్నచోటునుంచి పక్క కదలలేదట. మృతదేహాన్ని తీసుకు వెళ్తున్న వాహనంలో బయల్దేటప్పుడు కూడా పోలీసులు ఆమెను పక్కకు నెట్టేశారట. కొంతమంది ఎమ్మెల్యేలు ఆమెపై దాడి కూడా చేయడం జరిగిందట.MGR భార్య బంధువైన ఒక వ్యక్తి జయలలిత నుదుటిమీద తన్నాడట. ఇక ఈ అవమానంతో ఆమె బాధ పడలేదు.. కానీ అంత్యక్రియలకు వెళ్లకుండా చేశారని బాధ ఆమెను కలచివేసిందట. ఈ వార్తను తెలుసుకున్న కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు  నెమ్మదిగా ఆమె ఇంటి చుట్టూ చేరుకున్నారట.జరిగిన అవమానాన్ని ఖండించి ఆమెకు భరోసా ఇచ్చారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

MGR