డిసెంబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖండ చిత్రం ఎంతటి సంచలనం సృష్టించే విజయాన్ని నమోదు చేసుకుందో అందరికీ తెలిసిందే. తొలి రోజున భారీ కలెక్షన్లు సాధించిన ఈ చిత్రం రెండవరోజు మూడవ రోజు కూడా ఏమాత్రం కలెక్షన్లు తగ్గకుండా భారీగా వసూళ్లు సాధిస్తూ వెళుతుంది. ఇక నాలుగవ రోజు కూడా వీకెండ్ కావడంతో ప్రేక్షకులు ఈ సినిమాను రిపీటెడ్ గా తిలకిస్తూ భారీ విజయాన్ని నమోదు చేస్తున్నారు.  

ఏదేమైనా అఖండ సినిమా రెండవ లాక్ డౌన్ తర్వాత ప్రేక్షకులలో కదలిక ను తీసుకువచ్చిన సినిమాగా చెప్పుకోవచ్చు. అంతకు ముందు ఎన్ని సినిమాలు ప్రయత్నించినా కూడా ఒక రకమైన ఆడియన్స్ ధియేటర్లకు రావడానికి ఇష్టపడలేదు. కానీ అఖండ చిత్రం విజయం అందరిని థియేటర్ లకు తీసుకు వచ్చి థియేటర్లకు వారిని తీసుకు వచ్చే విధంగా సక్సెస్ అయింది. ముందు నుంచి కూడా ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. 

ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకులందరినీ అలరిస్తుంది అన్న అంచనాలను అందుకొని ఇప్పుడు భారీగా వసూళ్లు సాధిస్తుంది. అయితే ఇంతటి భారీ ఓపెనింగ్స్ ను అందించిన ఈ సినిమా రెండు వారాలు ఆడితే అత్యధిక లాభాలతో ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా తర్వాత రాబోయే చిత్రాలపై ఇప్పుడు కొంత ప్రెషర్ నెలకొని ఉందని చెప్పవచ్చు. అఖండ చిత్రం తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అతి పెద్ద చిత్రం పుష్ప. ఈ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో అనేది ఇక్కడ అసలు ప్రశ్న. ఈ చిత్రంపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. దానికి తోడు అల్లు అర్జున్ హీరోగా నటించడం సినిమా పట్ల ఆయన ఎంతో కాన్ఫిడెంట్ గా ఉండడం చూస్తుంటే ఈ చిత్రం కూడా అఖండ లాగానే భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది అని చెప్పొచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: