ప్రపంచంలో మనం వెల కట్టలేనిది అమ్మ ప్రేమ. తన జీవితాని త్యాగం చేసి బిడ్డలకు లైఫ్ ఇస్తుంది. పిల్లల సంతోషం కోసం ఏం అడిగినా చేస్తుంది. పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని ఎంత కష్టాని అయినా హాయిగా భరిస్తుంది. ఇక అలా తాను కష్టపడిన పిల్లలే ఆ తల్లి కోరికను నెరవేరిస్తే..ఎలా ఉంటుంది. అప్పుడు ఆ తల్లి కళ్లల్లో కనిపించే ఆనందం, సంతోషం ఏం చేసినా రాదు. ఇప్పుడు ఇలాంటి ఫీలింగ్ నే ఎంజాయ్ చేస్తుంది ఒక్కప్పటి హీరోయిన్ రేణూ దేశాయ్. తన కొడుకు అకీరా ఆమె కోరికను నెరవేర్చాడు. దీంతో ఆమె హ్యాపీగా ఉన్నాను అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

పవన్ కల్యాణ్ తో విడాకులు తీసుకున్న తరువాత రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన గురించి తన పిల్లల గురించి సంబంధించిన విషయాలను పోస్ట్ చేస్తూ అభిమానులను ఉత్సాహ పరుస్తుంటుంది. ఇక రీసెంట్ గా తన కొడుకు అకీరా గురించి పోస్ట్ చేస్తూ..ఓ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ని ఫ్యాన్స్ తో పంచుకుంది. అకీరాకి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఈ క్రమంలోనే అకీరా పియానో నేర్చుకున్నాడు. పియానో బాగా ప్లే  చేస్తాడు. దీంతో రేణూ దేశాయ్  తనకిష్టమైన పాటను తన పుట్టినరోజు నాడు ప్లే చేసి వినిపించమన్నింది.

అకీరా తల్లి కోరికను నెరవేరుస్తూ.. ఆమెకు ఇష్టమైన పాటను పియానో తో ప్లే చేసి వినిపించాడు. దీంతో హ్యాపీగా ఫీల్ అయిన రేణూ దేశాయ్ అందుకు సంబంధించిన వీడియోని షోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.."నాకు ఎంతో ఇష్టమైన పాటను నా కొడుకు అకీరా నా బర్త్ డే రోజున పియానో మీద ప్లే చేసి వినిపించడం చాలా హ్యాపీగా ఉంది. ఒక తల్లికి  ఇంతకంటే మంచి గిఫ్ట్‌ మరోకటి ఉండదు " అంటూ రేణూ దేశాయ్ తన కొడుకు ప్లే చేసిన పాటను అభిమానులతో షేర్ చేసుకుంది. దీంతో ఈ వీడియొ నెట్టింట తెగ వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: