నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన అఖండ చిత్రం డిసెంబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి అఖండమైన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఎక్కడ చూసినా జై బాలయ్య అంటూ అందరు కూడా థియేటర్లో ఆరుస్తుండటంతో సినిమా ఏ రేంజ్ లో నెలకొని ఉందో అర్థం చేసుకోవచ్చు. దానికి తగ్గట్లుగానే సినిమా కూడా చాలా బాగా ఉండడంతో సినిమాను ఎగబడి మరి ప్రేక్షకులు మళ్ళీ మళ్ళీ చూస్తున్నారు.

ముఖ్యంగా మాస్ ప్రేక్షకులను ఈ చిత్రం విపరీతంగా ఆలరిస్తుండగా బోయపాటి శ్రీను బాలకృష్ణ ను చూపించిన విధానం ప్రేక్షకులకు విపరీతంగా నచ్చి ఈ సినిమాకు ఇంత పెద్ద విజయం అందిస్తున్నారు. అయితే ప్రేక్షకులకు మాత్రమే కాదు సినిమా వారికి కూడా ఈ చిత్రం విజయం ఎంతో మంచి కిక్ ఇస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా హీరోలకు ఈ సినిమా ఇంత పెద్ద విజయం కావడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది దానికి కారణం లేకపోలేదు.

పెద్ద హీరోల సినిమాలు రాబోయే రెండు నెలల్లో భారీగా ఉన్నాయి. ఆ చిత్రాలు ఆడాలి అంటే ప్రేక్షకులు తప్పకుండా థియేటర్లకు కదిలి రావాలి. అలా చాలా మంది సినిమాలకు వెళ్ళము అన్న ప్రేక్షకులు థియేటర్లకు ఈ సినిమా చూడడానికి రావడం వారిని ఎంతగానో సంతోషపడుతుంది. అంతే కాదు తమ ట్విటర్ ఖాతాలో ఈ సినిమా గురిం చి పాజిటివ్ కామెంట్లు పెట్టి తమలోని విభేదాలను పక్కనపెట్టి ఐక్యమత్యమై ప్రేక్షకులు సినిమాకు వచ్చే విధంగా చేసుకుంటున్నారు హీరోలు. మరి అఖండమైన విజయం సాధించి న అఖండ సినిమా విజయం అందరిలో ఇంతటి మార్పు తీసుకు వస్తుందని ఎవరూ అనుకోరు. మరి అఖండ తెచ్చిన ఈ సక్సెస్ స్టోరీ సినిమాలు కంటిన్యూ చేస్త అనేది చూడాలి. సంక్రాంతి కి  పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: