టాలీవుడ్ సినిమా పరిశ్రమలో హీరోగా నిలదొక్కుకోవాలంటే ఒకే ఒక మంత్రం సక్సెస్ సాధించడం. సక్సెస్ లేకపోతే కొన్ని రోజులకు కనుమరుగై పోతాడు. సక్సెస్ ఉంటే మంచి క్రేజ్ తో డిమాండ్ తో పాపులారిటీ తో సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరో గా కొనసాగుతూనే ఉంటాడు. ఆ విధంగా హీరో నాని గత నాలుగైదు సినిమాలు సక్సెస్ కాకపోవడంతో ఒక్కసారిగా అందరి లో ఎంతో కలవరాన్ని సృష్టిస్తోంది.

ఒకప్పుడు సినిమాల ఎంపిక విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటూ వైవిధ్యత ప్రదర్శిస్తు తన కెరీర్ ను ముందుకు తీసుకు వెళ్ళడు. ఇప్పుడు ఆయన ఏ సినిమా చేసినా కూడా అది ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోవడంతో ఆయన కెరియర్ పై భారీగా ప్రభావం పడే ఆస్కారం ఉంది అని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే టక్ జగదీష్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీగా ప్లాప్ కావడంతో దాని పట్ల చాలా మంది అభిమానులు గుర్రుగా ఉన్నారు. ఎందుకు సినిమా ఎంపిక లో లోపం జరుగుతుందని వారు ప్రశ్నిస్తున్నారు. 

మరొకవైపు నాని మాత్రం ప్రేక్షకులను అలరించే సినిమాలోనే ఎంపిక చేసుకున్నాను అని నమ్మి ఫ్లాపు సినిమాలను ఎంపిక చేసుకుంటూ తన కెరీర్ ప్రమాదంలో పడవేసుటున్నాడు. ఒకటి రెండు సినిమాలు ఫ్లాప్ అయితే పర్వాలేదు కానీ వరుసగా నాలుగైదు సినిమాలు ఫ్లాప్ అవ్వడం అంటే నిజంగా అది ఎంత పెద్ద మిస్టేక్ అర్థం చేసుకోవచ్చు. ఇక నాని చేతిలో మూడు సినిమాలున్నాయి. డిసెంబర్ 23వ తేదీన ఆయన చేసిన శ్యామ్ సింగ రాయ్ చిత్రం విడుదలవుతోంది. ఆ సినిమాపై ఆయన భారీ అంచనాలు పెట్టుకున్న ఆ చిత్రంతో మంచి హిట్ కొట్టి ఫామ్ లోకి వచ్చి మళ్ళీ హీరోగా దూసుకుపోవాలని భావిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత దసరా అంటే సుందరనికి అనే రెండు సినిమాలను ఒప్పుకున్నాడు నాని. 

మరింత సమాచారం తెలుసుకోండి: