జనరల్ గా మన ఇంట్లో ని పెద్ద వారు అంటుంటారుగా ఇంట్లో వండిన కూర కంటే పక్కింటి పుల్లకూర రుచిగా ఉంటుంది అని. అలానే మన ఇండస్ట్రీ వాళ్లు కూడా మన తెలుగు అమ్మాయిలను వదిలేసి..పొరుగు రాష్ట్ర సుందరిమణులను తెచ్చుకుని సినిమాల్లో ఛాన్స్ లు ఇస్తున్నారు. ఇప్పటికే మన ఇండస్ట్రీలో తెలుగు వారు కంటే పక్క ఇండస్ట్రీ వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. అయినా కానీ ఇంకా చాలా మంది మన తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. ఈ క్రమంలోనే మరో ముద్దుగుమ్మ మన ఇండస్ట్రిపై కన్నేసింది.

ఆవిడే "సంయుక్త మీనన్". తెలుగులో ఎంటర్ అవ్వడంతోనే టాలీవుడ్ కండల వీరుడు రానా భార్య గా నటిస్తూ ప్రముఖుల  కళ్లు ఆమె పై పడేలా చేసుకుంది.  సాగర్ కే చంద్ర దర్శకత్వంలో మలీ స్టారర్ మూవీగా తెరకెక్కుతున్న సినిమా " భీమ్లా నాయక్ ". ఈ సినిమా లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ప్రతి నాయకుడిగా రానా దగ్గుబాటి నటిస్తుండడం విశేషం. ఇక్కడే ఈ సినిమా పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకునేలా చేసింది. నిజానికి ఈ భీమ్లా నాయక్ సినిమా మలయాళ వర్షన్ ‘అయ్యపనుమ్ కోషియుమ్’ సినిమాకు ఫుల్ రీమేక్ గా మన ముందుకు రాబోతుంది. సంక్రాంతి కానుకగా ధియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసారు.

ఇక రీసెంట్ గా విడుదలైన అడవితల్లి పాట చూసిన ప్రతి ఒక్కరు ఈ సినిమాలో రానా భార్యగా నటిస్తున్న సంయుక్త మీనన్ ఎవరు అంటూ గూగుల్ లో సర్చ్ చేయడం మొదలు పెట్టారు.   దీంతో  ఈమె నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఈ అమ్మడు 2016లో ‘పాప్‌కార్న్’ అనే మలయాళ సినిమాతో వెండితెరకు పరిచయమైంది. ఇక ఆ సినిమా తో మంచి గుర్తింపు సంపాదించి.. తమిళంలోను సినిమా అవకాశాలు దక్కించుకుంది. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. మలయాళ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ అలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు సైన్ చేస్తూ కెరీర్ ని పీక్స్ లో ఉంచడానికి ట్రై చేస్తుంది. మరి ఈ  మలయాళ బ్యూటి తెలుగు ప్రజలను ఎంత మెప్పిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: