అల్లు అరవింద్ కు కేవలం ముగ్గురు కుమారులే అని అందరూ అనుకుంటూ ఉంటారు. అయితే వారు అల్లు అర్జున్, అల్లు శిరీష్, అల్లు బాబి అనే వారు మాత్రమే మనకి తెలుసు. ఇందులో ఇద్దరు స్టార్ హీరోలు కాగా మరొక కుమారుడు నిర్మాతగా రాణిస్తున్నాడు. అయితే వీరిలో కూడా అల్లుశిరీష్ సక్సెస్ కాలేకపోయాడు. అల్లు అర్జున్ మాత్రం దూసుకుపోతున్నాడు. అయితే వీరు కాకుండానే అల్లు అర్జున్ కి ఇంకొక సోదరుడు కూడా ఉండే వారట. అయితే అతను ఏమయ్యాడో.. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


నిర్మాతగా అల్లు అరవింద్ ఎన్నో సినిమాలకి వ్యవహరించిన సంగతి మనకు తెలిసిందే. అల్లు అరవింద్ కు మొదటి కుమారుడు అల్లు బాబి జన్మించగా.. ఆ తర్వాత అల్లు రాజేష్, అల్లు అర్జున్ పుట్టారట. అల్లు రాజేష్ మాత్రం తనకి ఏడు సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడే ఒక రోడ్డు ప్రమాదంలో మరణించారట. దీంతో అల్లుఅరవింద్ దంపతులు చాలా తీవ్ర నిరాశకు లోనయ్యారట. అయితే రాజేష్ మరణంతో అల్లు అరవింద్ భార్య.. చాలా దుఃఖించిందట.

అయితే ఎలాగైనా తనకి తన కొడుకు కావాలని అల్లు అరవింద్ ని అడిగిందట. కానీ అప్పటికే ఆమెకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకోవాలని నిశ్చయించుకున్నట్లు గా సమాచారం. కానీ ఆ తరువాత ఇది జరగగానే.. ఆపరేషన్ చేయించుకోనని చెప్పి గర్భం దాల్చినట్లు సమాచారం. ఆ తర్వాతే అల్లుశిరీష్ అనే అబ్బాయి పుట్టాడు అన్నట్లుగా సమాచారం. ఇక అల్లుశిరీష్ లోనే తన కుమారుడు రాజేష్ ని చూసుకుంటూ మురిసిపోయారట ఈ దంపతులు.

అందుచేతనే అల్లు అర్జున్, అల్లు బాబి కంటే ఎక్కువగా శిరీష్ నే ఇష్టపడతారు ఈ దంపతులు.ఒకవేళ రాజేష్ మరణించకుండా వుంటే ఎంత గొప్ప స్టార్ అయ్యేవాడు మనం ఊహించ వచ్చు. అయితే వీరందరి కన్నా ఎక్కువగా పేరు ప్రఖ్యాతలు పొందిన హీరో మాత్రం అల్లు అర్జున్ అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: