కన్నడ దిగ్గజ నటుడు, నిర్మాత, దర్శకుడు ఎస్.శివరామ్(83) తుదిశ్వాస విడిచారు. తలకు గాయం కావడంతో డిసెంబ‌ర్ 02న  బెంగళూరులోని ఆస్పత్రిలో  ఆయన చేరారు.  ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గురువారం రోజు ఇంట్లో పూజా చేస్తుండగా శివరామ్ కండ్లు తిరిగి పడిపోయారు. దీంతో తలకు గాయమైన‌ది,  ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అత‌నికీ బ్రెయిన్లో బ్లీడింగ్ అయింద‌ని తేలింది.  ఆయన వయసు వృద్ధాప్యం కారణంగా వైద్యులు సర్జరీ చేయడం కుదరలేదు. రెండు రోజులుగా ఆయనకు చికిత్స అందిస్తున్నప్పటికీ.. శివరామ్ను డాక్టర్లు ప్రాణాల‌తో బ‌తికించ‌లేక‌పోయారు.

దాదాపు ఆరు దశాబ్దాల పాటు కన్నడ సినిమాల‌లో ఆయన పనిచేసారు. కథానాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, హాస్య పాత్రలు, సహాయపాత్రలు వంటి వాటిని ఆయన‌ పోషించారు. 1965 సినిమాలో 'బేరత జీవా' సినిమాతో నటుడిగా పరిచయమై.. దాదాపు 90కి పైగా సినిమాల‌లో నటించారు.  తన సోదరుడు ఎస్.రామనాథన్తో కలిసి కూడా పలు సినిమాలను  నిర్మించారు శివరామ్. 1972లో  శివరామ్కు నిర్మాతగా తొలి సినిమా 'హదయ సంగమ'.. అదేవిధంగా 1985లో వచ్చిన బాలీవుడ్ మూవీ 'గిరఫ్తార్' నిర్మించిన‌ది ఈయనే. ఇందులో ముగ్గురు స్టార్ హీరోలు అమితాబ్ బచ్చన్, కమల్హాసన్, రజనీకాంత్ తో కలిసి నటించారు శివ‌రామ్‌. 2010-11 సంవ‌త్స‌రానికీ డాక్ట‌ర్‌రాజ్‌కుమార్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును కర్నాట‌క ప్ర‌భుత్వం శివ‌రామ్‌కు బ‌హుక‌రించిన‌ది. అదేవిధంగా 2013లో ప‌ద్మ‌భూష‌ణ్ డాక్ట‌ర్ స‌రోజిని జాతీయ అవార్డును అందుకున్నారు.


1928 జ‌న‌వ‌రి 28న త‌మిళ బ్రాహ్మ‌ణ కుటుంబంలో జ‌న్మించిన శివరాం త‌న ఆరు ద‌శాబ్దాల‌కు పైబ‌డిన సినీ జీవితంలో క‌థానాయ‌కుడి నుంచి స‌హాయ న‌టుడిగా విభిన్న త‌ర‌హా పాత్ర‌ల‌ను పోషించారు శివ‌రామ్‌. అంద‌రితో శివ‌రామ‌న్న‌గా పిలుచుకునే ఆయ‌న న‌ట‌న‌, ద‌ర్శ‌క‌త్వంతో పాటు కొన్ని చిత్రాల‌ను నిర్మాత‌గా కూడా వ్య‌వ‌హ‌రించారు. ముఖ్యంగా 1965లో బెర‌త జీవ చిత్రంతో త‌న న‌ట ప్ర‌స్థానాన్ని ప్రారంభించిన ఆయ‌న దుడ్డె దొడ్డ‌ప్ప ల‌గ్న ప‌త్రిక చిత్రాల‌తో శివ‌రామ్ మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: