బిగ్ బాస్ హౌస్ లో ఇక శనివారం ఎపిసోడ్ చాలా రసవత్తరంగా జరిగిన విషయం తెలిసిందే. హోస్ట్ నాగార్జున అయితే ఎప్పటిలాగానే హౌస్ మేట్స్ కి చురకలు అంటిస్తూనే వాళ్లకి కౌంటర్స్ వేస్తూ తనదైన స్టైల్లో రెచ్చిపోయాడు.ప్రతి హౌస్ మేట్ పై కూడా కౌంటర్స్ ఏస్తూనే వున్నాడు.ఇక్కడే బిగ్ బాస్ ఫిర్యాదుల బాక్స్ లో హౌస్ మేట్స్ పై ఈవారం ఏదైనా కంప్లైట్స్ ఉంటే చేయమని చెప్పాడు కింగ్ నాగార్జున. దీంతో అందరూ ఒక్కొక్కరి పేరు రాసి వారితో ఉన్న ఇబ్బందుల గురించి చెప్పుకున్నారు. మానస్ షణ్ముక్ పై కంప్లైంట్ చేస్తూ లాజికల్ గా అతన్ని లాక్ చేశాడు. ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే సన్నీతో డైరెక్ట్ గా మాట్లాడుకుంటా అని చెప్పే షణ్ముక్, టాస్క్ లో మాత్రం నాతో సన్నీతో చెప్పు అంటూ ఎలా మాట్లాడతాడు అంటూ షణ్ముఖ్ పై కంప్లైంట్ ఇచ్చాడు.ప్రతిసారి సన్నీతో ప్రాబ్లమ్ ఉంటే నువ్వెందుకు మాట్లాడుతున్నావ్ అంటాడు అని, కానీ ఐస్ టబ్ టాస్క్ జరిగేటపుడు నేను సిరిని కాలు తీయమని చెప్తుంటే, మీ ఫ్రెండ్ కి కూడా చెప్పు అంటూ షన్ను ఎలా అడుగుతాడు అని కంప్లైంట్ చేశాడు. దీంతో షణ్ముక్ కాస్త ఆలోచనలో పడ్డాడు.

కేవలం సిరికి మాత్రమే కాదు  సిరితోపాటు అలాగే సన్నీకి కూడా చెప్పు ఇద్దరూ ఎగ్రెసివ్ గా గేమ్ ఆడుతున్నారు కదా అనేదే నా పాయింట్ అంటూ షన్ను కవర్ చేశాడు. కానీ, మానస్ మాత్రం తన పాయింట్ ని అక్కడ కూడా లాజికల్ గా చెప్పేశాడు. ఇక్కడే హోస్ట్ నాగార్జున కూడా మానస్ పై ఒక ఫిర్యాదు చేశాడు. టైమ్ టాస్క్ లో నీకు నువ్వు బాగానే కౌంట్ చేసుకోని ఫస్ట్ వచ్చావ్, మరి సన్నీ విషయంలో నువ్వు ఎందుకు ఎక్కువ కౌంట్ చేశావ్ అని అడిగాడు.పింకీ ఇంకా కాజల్ ఇద్దరూ కూడా నన్ను కన్ఫూజ్ చేశారని, నేను బహుశా 20 నిమిషాలే లెక్కపెట్టానా అని డౌట్ వచ్చి మళ్ళీ కాస్త సన్నీ విషయంలో ఎక్కువ కౌంట్ చేస్తూ చెప్పాల్సి వచ్చిందని మానస్ అన్నాడు. ఇక ఆర్ జే కాజల్ కి కూడా నాగార్జున ఫుల్ క్లాస్ పీకాడు. సౌండ్స్ విషయంలో అందరూ నిన్ను రిక్వస్ట్ చేస్తున్నా మాట్లాడుతునే ఉన్నావ్, పైగా ఆన్సర్స్ కూడా పైకి చెప్తున్నావ్ ఇదేనా నీ గేమ్ అంటూ ఆమెని అడిగాడు. దీంతో కాజల్ తన తప్పు తెలుసుకొని బిగ్ బాస్ కి సారీ చెప్పడం జరిగింది.అలాగే హౌస్ మేట్స్ కి కూడా కాజల్ సారీ చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: