తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన నటుడు శ్రీకాంత్ అని అందరికి తెలుసు.. తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకొని ఎంతో మంచి అభిమానాన్ని సొంతం చేసుకున్నాడట.

ఈయన ఒక నటుడుగానే కాకుండా నిర్మాత కూడా బాధ్యతలు చేపట్టాడని తెలుస్తుంది.ఇక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఒక సభ్యుడిగా కూడా బాధ్యతలు చేపట్టాడట.ఈయన మరో నటి ఊహను పెళ్లి చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. ఇక వీరికి ఇద్దరు కొడుకులు ఒక కూతురు కూడా ఉందని తెలుస్తుంది..

ఈయన తొలిసారిగా సినీ ఇండస్ట్రీకి 1991లో పీపుల్స్ ఎన్కౌంటర్ అనే సినిమాతో పరిచయమయ్యాడట.. ఈ సినిమా తనకు మంచి సక్సెస్ ఇవ్వటంతో అదే ఏడాది వరుస సినిమాలలో అవకాశాలు అందుకున్నాడట.. ఆ తర్వాత తాజ్ మహల్, ఎగిరే పావురమా మరియు ప్రేయసి రావే, ఆహ్వానం, ఆమె, పెళ్లి సందడి, ఉయ్యాల అలాగే పెళ్ళాం ఊరెళితే ఇలా ఎన్నో సినిమాలలో నటించి మంచి సక్సెస్ అందుకున్నాడట..

  దాదాపు 125 సినిమాలలో నటించాడట శ్రీకాంత్. ఈయన సెకండ్ హీరోగా కూడా పలు సినిమాలలో నటించాడని తెలుస్తుంది.. ఎక్కువగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలోనే నటించాడట.. ఇక ఈ మధ్య నెగిటివ్ పాత్రలలో కూడా నటిస్తున్నాడని సమాచారం.. కానీ అంత సక్సెస్ కాలేకపోతున్నాడట.. ఇదిలా ఉంటే శ్రీకాంత్ కు బాలయ్యతో నటించాలన్న కోరిక ఉందని 12 సంవత్సరాల కిందటనే తెలిపాడట. ఆయన 2009లో నటించిన సినిమా మహాత్మ ఈ సినిమా తనకు మంచి సక్సెస్ ను అందించిందని ఇక ఈ సినిమా విడుదల సమయంలో తనకు బాలయ్య తో నటించాలని కోరిక ఉందని తెలిపాడట మొత్తానికి ఆ కోరిక 12 ఏళ్లకు తీరిందని చెప్పాడట.ఇంతకు అదే సినిమానో కాదు అఖండ అని తెలుస్తుంది.తాజాగా విడుదలై మంచి బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకొని థియేటర్ లో బాగా సందడి చేస్తుందని తెలుస్తుంది.బోయపాటి మరియు బాలయ్య కాంబినేషన్ లో మరోసారి తెరపైకి వచ్చిన సినిమా అఖండ ఈ సినిమా డిసెంబర్ 2న విడుదల అయ్యి సెన్సేషనల్ గా మారిందని తెలుస్తుంది.. ఇందులో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించిందని ఇక ఇందులో జగపతిబాబు తో పాటు శ్రీకాంత్ కూడా విలన్ పాత్రలో నటించాడట. నిజానికి ఈ సినిమా విడుదలకు ముందు శ్రీకాంత్ పై కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారట ప్రేక్షకులు.
కానీ సినిమా హిట్టయినా శ్రీకాంత్ పాత్ర మాత్రం హిట్ కాలేక పోయిందని వార్తలు వినిపిస్తున్నాయట. నిజానికి శ్రీకాంత్ విలన్ గా మెప్పించలేకపోయాడని తెలుస్తుంది. ఎంతో కాలం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ హీరోగా కొనసాగిన శ్రీకాంత్ విలన్ గా అంతగా సెట్ అవ్వలేకపోయాడట ఎవరు కూడా శ్రీకాంత్ పాత్ర గురించి అంతగా మాట్లాడుకోలేకపోతున్నారట.మొత్తానికి బాలయ్యతో నటించిన అవకాశం దక్కింది కానీ విలన్ గా మాత్రం ప్రేక్షకులను మెప్పించలేక పోయాడట శ్రీకాంత్. మరి ఇకనైనా శ్రీకాంత్ విలన్ గా కొనసాగుతాడో లేదో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: