ప్రస్తుతం తెలుగు లో మోస్ట్ అవైటెడ్ సినిమాలు ఏవైనా ఉన్నాయి అంటే అందులో ఆర్ఆర్ఆర్, రాదే శ్యామ్, భీమ్లా నాయక్ సినిమాల గురించే చెప్పుకోవాలి. అయితే ఇప్పటికే ఈ మూడు సినిమా లలో దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం లో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించారు, ఈ సినిమా ట్రైలర్ ను డిసెంబర్ 9 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇది ఇలా ఉంటే రాదే శ్యామ్, భీమ్లా నాయక్ సినిమాల ట్రైలర్ విడుదల తేదీలను మాత్రం ఇప్పటి వరకు చిత్ర బృందాలు అఫీషియల్ గా ప్రకటించలేదు, అయితే ఫిలిం నగర్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ప్రభాస్ హీరో గా పూజా హెగ్డే హీరోయిన్ గా రాధా కృష్ణ దర్శకత్వం లో తెరకెక్కుతున్న రాదే సినిమా సినిమా ట్రైలర్ ను డిసెంబర్ 17 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ఒక టాక్ ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతుంది.

అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా హీరోలుగా నిత్య మీనన్, సంయుక్త మీనా హీరోయిన్ లుగా సాగర్ కే చంద్ర దర్శకత్వం లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే లో తెరకెక్కుతున్న సినిమా భీమ్లా నాయక్, ఇప్పటికే ఈ సిని మా నుండి టీజర్ లను, పాటలను చిత్ర బృందం విడుదల చేయబ్గా వీటికి జనాల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా ఈ సినిమా పై ఇప్పటికే ఉన్న అంచనాలను అమాంతం పెంచేశాయి. అయితే ఈ సినిమా ట్రైలర్ ను జనవరి 1 వ తేదిన విడుదల చేసే అవకా శాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి, కానీ ఈ విషయం పై ఇప్ప టి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: