హాట్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ వరుణ్ తేజ్ హీరోగా విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం లో తెరకెక్కిన కంచె సినిమాతో తెలుగు ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు దక్కించుకుంది, ఈ సినిమా మంచి విజయం సాధించడం తో ఈ ముద్దు గుమ్మకు తెలుగు నాట పర్వాలేదు అనే రేంజ్ లో సినిమా అవకాశాలు కూడా దక్కాయి. అందులో భాగంగా ఈ హాట్ బ్యూటీ నక్షత్రం, జయ జానకి నాయక వంటి సినిమాల్లో ప్రముఖ పాత్రలో నటించి మెప్పించింది. ఇలా నటించినవి తక్కువ సినిమాలే అయిన టాలీవుడ్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ఈ ముద్దు గుమ్మ తాజా గా అఖండ సినిమా తో మరో సారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది. నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా టాలీవుడ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా ప్రగ్యా జైస్వాల్ కు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించింది.

ఇలా తెలుగు లో క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతున్న ఈ ముద్దు గుమ్మ బాలీవుడ్ లో ఒక అద్భుతమైన అవకాశాన్ని తన ప్రమేయం లేకుండానే చేజారినట్లు తెలుస్తోంది. అసలు విషయానికి వస్తే..  బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన అంతిమ్ సినిమా లో ఒక ప్రత్యేక పాట కోసం చిత్ర బృందం ప్రగ్యా జైస్వాల్ ను సంప్రదించగా ఈ ముద్దు గుమ్మ కూడా దానికి ఓకే చెప్పేసిందట, అయితే చివరగా సినిమా షూటింగ్ ప్రారంభం అయిన తర్వాత ఆ పాటను చిత్రీకరించి సినిమాలో పెట్టినట్లయితే సినిమాకు అడ్డంకి గా మారుతుంది అనే ఉద్దేశంతో ఈ పాటను చిత్రీకరించే ఆలోచనను చిత్ర బృందం విరమించుకున్నట్టు, ఆ విషయాన్ని ప్రగ్యా జైస్వాల్ కు చెప్పగా తాను కూడా ఆ విషయానికి కూలంగా స్పందించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయం పై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు, ఇలా తన ప్రమేయం లేకుండానే బాలీవుడ్ అవకాశం ప్రగ్యా జైస్వాల్ చేజారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: