తెలుగు అమ్మాయి రీతూ వర్మ ఎన్టీఆర్ హీరో గా తెరకెక్కిన బాద్ షా సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఆ తర్వాత ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో నటించిన ఈ ముద్దు గుమ్మ పెళ్లి చూపులు సినిమా లో హీరోయిన్ గా నటించి ఎంతో మంది ప్రశంసలు దక్కించుకుంది. చిన్న పాత్రల నుండి హీరోయిన్ వరకు ఎదిగిన ఈ ముద్దు గుమ్మ కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా తమిళ ఇండస్ట్రీ లో కూడా నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పటికే ఈ సంవత్సరం నాని హీరోగా తెరకెక్కిన  టక్ జగదీష్ సినిమాతో అలరించిన ఈ ముద్దు గుమ్మ, ఆ తర్వాత కొంత కాలానికి విడుదలయిన వరుడు కావలెను సినిమాతో కూడా తెలుగు ప్రేక్షకులను పలకరించింది.

ఇలా తెలుగు లో వరుస సినిమాల్లో నటిస్తున్న ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం శర్వానంద్ హీరో గా తెరకెక్కుతున్న ఒకే ఒక జీవితం సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇలా వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ తెలుగమ్మాయి మరో క్రేజీ సినిమా ఆఫర్ ను కొట్టేసింది అంటూ సోషల్ మీడియా లో ఒక వార్త తెగ వైరల్ అవుతుంది. తమిళ హీరో శివ కార్తికేయన్ తో ఒక మూవీ చేయడానికి ఈ ముద్దు గుమ్మ ఓకే చేసినట్లు తెలుస్తోంది. దుల్కర్ సల్మాన్ హీరో గా తెరకెక్కిన కన్నుమ్ కన్నుమ్ కొల్లైయడిత్తాల్ సినిమాలో హీరోయిన్ గా నటించిన రీతూ వర్మసినిమా విజయం తో తమిళ నాట మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. అయితే ఈ క్రేజ్ తోనే శివ కార్తికేయన్ సినిమాలో అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కు జాతిరత్నాలు సినిమా దర్శకుడు అనుదీప్ కే వి దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళం లోనూ విడుదల కానుంది.  ఇలా రీతూ వర్మ క్రేజీ సినిమా ఆఫర్ లను దక్కించుకుంటూ దూసుకుపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: