టాలీవుడ్ లో ఒక్కో సినిమాతో ప్రస్తుతం ఎవరికీ అందనంత ఎత్తుకు దూసుకెళ్తున్న దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి. ఇక ప్రస్తుతం ఆయన తీస్తున్న భారీ సినిమా ఆర్ఆర్ఆర్. తొలిసారిగా ఎన్టీఆర్, చరణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా రాజమౌళి తెరకెక్కిస్తుండగా దానయ్య దీనిని ఎంతో గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నారు.

ఇటీవల షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే విషయం ఏమిటంటే ప్రస్తుతం పరశురామ్ తో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న మహేష్ బాబు, దాని తరువాత త్రివిక్రమ్ తో సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఇక ఆపైన ఎస్ ఎస్ రాజమౌళి తో కూడా మహేష్ మరొక సినిమా చేయనున్నారు. అయితే ఇటీవల ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు షో కి విచ్చేసిన మహేష్ బాబు అందులో తన అనుభవాలు పంచుకున్నారు.

నేడు కొద్దిసేపటి క్రితం ఆ కార్యక్రమాన్ని జెమినీ టివి లో ప్రసారం చేయగా అందులో భాగంగా రాజమౌళి తో మీ నెక్స్ట్ సినిమా ఉంది కదా, ఆ టైం ఆయన అంటే ఏంటి అనేది మీకు తెలుస్తుంది అంటూ మహేష్ కి ఎన్టీఆర్ సరదాగా పంచ్ వేస్తారు. నిజానికి రాజమౌళి తాను చేసే సినిమాలోని హీరోల నుండి తనకు కావల్సిన అవుట్ ఫుట్ ని ఎంతో పక్కాగా రాజమౌళి రాబట్టుకుంటారు అనేది ఎన్టీఆర్ ఉద్దేశ్యం. అందుకే ఆయనని పని టార్చర్ పెట్టె రాక్షసుడు అని కూడా పలువురు ఆర్టిస్టులు సరదాగా పలు సందర్భాల్లో వెల్లడించడం జరిగింది. ఇక ఎన్టీఆర్ కి రాజమౌళి కి స్టూడెంట్ నెంబర్ వన్ మూవీ నుండి మంచి అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. మరి త్వరలో మహేష్ తో రాజమౌళి ఎటువంటి సినిమా చేయనున్నారా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: