రూమర్లకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది హీరోయిన్ ఇలియానా. ఈ రెండు పేర్లకు ఎనలేని అనుబంధం ఉందని చెప్పుకోవచ్చు. తెలుగు ఇండస్ట్రీలో మంచి పొజిషన్ లో ఉన్నప్పుడు ఈమె ఇతర ఇండస్ట్రీ కి వెళ్లి షాక్ ఇచ్చింది. ఆ తరువాత తెలుగు ఇండస్ట్రీ గురించి అక్కడ తప్పుగా మాట్లాడిందని కొన్ని పుకార్లు కూడా బాగా వైరల్ గా మారాయి. దీంతో ఈమెను తెలుగు ఇండస్ట్రీ డైరెక్టర్లు, నిర్మాతలు కాస్త దూరం పెట్టడం జరిగింది.. అయితే ఈ విషయం అధికారికంగా బయటికి రాలేదు.


ఆ తరువాత తన పర్సనల్ జీవితం మీద కూడా కొన్ని పుకార్లు వెలువడ్డాయి. ఇలాంటి ఎన్నో బాధలను భరిస్తూ తన జీవితాన్ని గడుపుతోంది. అయితే ఇప్పుడు మరొకసారి ఇలాంటి వార్తలే ఆమె పైన పుట్టుకొచ్చాయి. అయితే వీటిపై ఆమె ఈ విధంగా స్పందించింది.. ఇలియానా విదేశీ వ్యక్తి అయిన ఒక వ్యాపారవేత్తతో ప్రేమలో పడి వివాహం చేసుకుంటుంది అని వార్తలు వచ్చాయి.. అయితే ఈ విషయంపై ఇలియానా ఆ వ్యక్తి యొక్క ఫోటోలను కొన్నింటిని సోషల్ మీడియాలో  షేర్ చేసి బాగా టీజ్ చేసింది. కానీ కొద్ది రోజులకే అతడినే వివాహం చేసుకొని అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది ఇలియానా.

తర్వాత వారిద్దరి మధ్య ఎలాంటి మనస్పర్థలు వచ్చాయో తెలియదు కానీ.. ఎట్టకేలకు పెళ్లి అయిన కొద్ది రోజులకే విడాకులు తీసుకున్నారు.. కానీ ఎందుకు.. ఏమిటి..ఎలా.. అనే  విషయాలు మాత్రం ఎవరికీ తెలియదు అని చెప్పాలి. ఇక మళ్ళీ గత కొద్దిరోజుల నుంచి పెళ్లి అంటూ పుకార్లు మొదలయ్యాయి. అయితే తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో తో ప్రేమాయణం నడుపుతోందని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అంతే కాదు అతనికి ముందుగానే పెళ్లయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్లు సమాచారం. ఇలాంటి పుకార్ల పై మరోసారి స్పందించిన ఈ ముద్దుగుమ్మ మళ్లీ పెళ్లి అనే ఊసేలేదు అంటూ తేల్చి చెప్పేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: