అఖండ... కరోనా కష్టకాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఓ ఊపు తెచ్చిన సినిమా. ఇంకా చెప్పాలంటే.. యువ రత్న నందమూరి బాలకృష్ణ చరిత్రలోనే అఖండ ఓ మైలురాయిగా నిలిచింది. బాలకృష్ణ, బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన బీబీ - 3 అఖండ. డిసెంబర్ 2వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా 16 వందల స్క్రీన్‌లపై విడుదలైన ఈ సినిమా బాలయ్య అభిమానులను విపరీతంగా అలరిస్తోంది. థియేటర్లలో బాలకృష్ణ విశ్వరూపంతో జై బాలయ్య నినాదాలతో హోరెత్తిస్తున్నారు నందమూరి అభిమానులు. గతంలో బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాల కంటే కూడా అఖండ ఒక రేంజ్‌లో ఉందంటున్నారు. ప్రస్తుతం తెలుగు సిని పరిశ్రమకు అఖండ ఓ బూస్ట్‌లా మారింది కూడా. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా రిలీజ్ ఆలస్యమైనప్పటికీ ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రం ఒక రేంజ్‌లో చేసేసింది. ఏకంగా 53 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ అఖండకు జరిగింది. రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో కూడా హౌస్ ఫుల్ కలెక్షన్లతోనే సినిమా నడుస్తోంది. కొన్ని చోట్ల రిపీట్ ఆడియన్స్ కూడా.

అఖండ తెలుగు రాష్ట్రాల్లో నాలుగో రోజు భారీ వసూళ్లు సాధించింది. నైజాం ఏరియాలో 2.95 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 2.03 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో తుఫాన్ ప్రభావంలో కూడా 87 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఇక ఉభయ గోదావరి జిల్లాల్లో 99 లక్షల రూపాయలను తన ఖాతాలోవేసుకుంది. గుంటూరు, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో కోటీ 48 లక్షల రూపాయలను సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్‌గా 8 కోట్ల 31 లక్షల రూపాయల షేర్ సాధించింది. 13 కోట్ల 80 లక్షల గ్రాస్ కలెక్షన్ సాధించింది. ఇక నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా కలిపి 73 కోట్ల 60 లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్ రాబట్టింది. బాలయ్యకు ఓవర్సీస్‌లో మాస్ ఫాలోయింగ్ ఎక్కువ. దీంతో విదేశాల్లో కూడా అఖండ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. కేవలం నాలుగు రోజుల్లోనే ఓవర్సీస్‌లో 800k డాలర్లను అఖండ వసూలు చేసింది. వకీల్ సాబ్ కలెక్షన్లతో పోల్చితే... ఏకంగా 57k డాలర్లు ఎక్కువగా రాబట్టింది అఖండ. ఏమైనా... లేట్‌గా వచ్చినా కూడా లేటెస్ట్ గానే వచ్చాడు బాలయ్య.


మరింత సమాచారం తెలుసుకోండి: