ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులందరికీ కూడా ఫేవరెట్ షో గా మారిపోయింది బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్..ప్రస్తుతం ఈ సినీ సెలబ్రిటీ షో పైన బుల్లితెర ప్రేక్షకులు అందరికి కన్ను ఉంది అని చెప్పాలి. గత నాలుగు సీజన్ల నుంచి తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ కార్యక్రమానికి ఇప్పుడు ఐదవ సీజన్ లో కూడా అదే రేంజ్ లో అలరిస్తూ ఉంది. తెలుగు బుల్లితెరపై ప్రారంభమైన బిగ్బాస్ కార్యక్రమం చూస్తూ చూస్తూ ఉండగానే ఏకంగా వంద రోజులకు దగ్గర పడుతుంది. 19 మంది తో బిగ్బాస్ కార్యక్రమం మొదలు కాగా ప్రస్తుతం బిగ్బాస్ హౌస్లో కేవలం ఆరు మంది కంటెస్టెంట్స్ మాత్రమే కొనసాగుతున్నారు.



 ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ లో ఎవరు విన్నర్ గా నిలువ బోతున్నారు అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది.. ఎవరికివారు బిగ్ బాస్ టైటిల్ గెలుచుకోవడానికి తీవ్రంగానే కసరత్తులు చేస్తున్నారు. ఇకపోతే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కు ఎంతో మంది ప్రేక్షకులు మద్దతు తెలుపుతూ ఓట్లు వేస్తున్నారు. ఇక మరోవైపు కొంతమంది సినీ సెలబ్రిటీలు సైతం బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లకు మద్దతు తెలుపుతూ ఉండడం గమనార్హం.. ఈ క్రమంలోనే బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తాను ఎవరికీ మద్దతు తెలుపుతున్నాను అన్న విషయాన్ని చెప్పుకొచ్చాడు.


 బిగ్బాస్ ఐదవ సీజన్ కి విన్నర్గా నిలిచేందుకు విజే సన్నీకి అవకాశం ఉంది అంటూ రాహుల్ సిప్లిగంజ్ చెప్పుకొచ్చాడు. సన్నీ గేమ్ ఎంతో బాగా ఆడుతున్నాడని అందుకే అతను బిగ్ బాస్ విన్నర్ గా నిలిచే అవకాశం ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. అయితే తన పోస్టులతో ఎవరిని ఇన్ఫ్లూయెన్స్ చేయడానికి ప్రయత్నించడం లేదు అంటూ చెప్పుకొచ్చాడు. తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే చెప్పానని ఇక ఎవరికి నచ్చిన వాళ్లకు వారు మద్దతు తెలుపవచ్చు అంటూ రాహుల్ సిప్లిగంజ్ అన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: