నందమూరి బాలకృష్ణ.. ఎప్పుడు గంభీరంగానే కనిపిస్తూ ఉంటారు. అయితే తాను పైకి గంభీరంగా కనిపించినప్పటికీ  తన మనసు మాత్రం ఎంతో సున్నితమైనది అని చెబుతూ ఉంటారు బాలకృష్ణ. ఇక బాలకృష్ణ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తనదైన పంచులతో చేసే రచ్చ చూసిన కూడా.. బాలకృష్ణ తన స్నేహితులతో ఎంత ఫ్రెండ్లీగా ఉంటారు అన్నది అర్థమవుతూ ఉంటుంది. అయితే ప్రస్తుతం బాలకృష్ణ అటు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగానే కాకుండా ఏపీలో ఎమ్మెల్యేగా కూడా కొనసాగుతున్నారు. ప్రతిపక్ష టిడిపి పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు బాలకృష్ణ.



 అయితే బాలకృష్ణ సహా నందమూరి ఫ్యామిలీ కి  కొంతమంది పై ఎన్నో రోజుల నుంచి ఒక అపవాదు కొనసాగుతూనే వస్తుంది. తండ్రి ఎన్టీఆర్ ను ఒంటరి చేసి చంద్రబాబు ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడవడానికి బాలకృష్ణ కూడా మద్దతు ఇచ్చాడు అంటూ ఎన్నో వార్తలు కూడా హల్ చల్ చేశాయి. ఇలా సొంత కొడుకులే తండ్రి ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచారని ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో ఊపేసాయ్. అయితే ఈ వార్తలు తనను ఎంతగా బాధ పెట్టాయ్ అన్న విషయాన్ని ఇటీవలే చెప్పారు నందమూరి బాలకృష్ణ. అంతేకాదు తన తండ్రి గురించి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు నందమూరి బాలకృష్ణ.



 నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న unstoppable అనే కార్యక్రమానికి సంబంధించి ప్రోమో ఇటీవలే విడుదలైంది. ఇక ఈ ప్రోమోలో భాగంగా బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమా చిత్రబృందం మొత్తం స్పెషల్ గెస్ట్ గా వచ్చారు. ఈ సందర్భంగా ప్రోమో మొత్తం ఎంతో సందడి సందడిగా సాగిపోయింది  కానీ చివర్లో తన తండ్రికి వెన్నుపోటు పొడిచారు అంటూ తనను ఎంతో మంది అన్నారు. ఎన్టీఆర్ తన తండ్రి తో పాటు ఒక గొప్ప నాయకుడు.. నా అభిమాన హీరో ఆయనను వెన్నుపోటు పొడిచా అంటూ నాపై నిందలు వేయడం ఎంతో బాధ కలిగించింది అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ విషయం మాట్లాడుతుంటే కన్నీళ్లు వస్తాయి అటు బాలకృష్ణ ఎంతగానో ఎమోషన్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: