తెలుగు సినిమా పరిశ్రమలో ఈ మధ్యకాలంలో బయోపిక్ లకు సంబంధించిన ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. బయోపిక్ విషయంలో కొంతమంది టాలీవుడ్ అగ్ర నిర్మాతలు ఆసక్తి కరం గా ఉన్న నేపథ్యంలో కొంత మంది స్టార్ హీరోలు కూడా వాటి విషయంలో ఆసక్తి చూపిస్తున్నారు. కొంత మంది అగ్ర హీరోలు ఈ మధ్య కాలంలో కొన్ని కొన్ని అంశాల్లో కాస్త వినూత్నంగా ఆలోచించడమే కాకుండా కొంత మంది ప్రముఖుల బయోపిక్ తెరకెక్కిస్తే కచ్చితంగా ఫలితం ఉంటుంది అనే భావనలో ఉన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొన్ని కొన్ని అంశాల్లో కాస్త తెలుగు సినిమా పరిశ్రమ జాగ్రత్తగా ముందుకు వెళ్లకపోతే భవిష్యత్తులో కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

అందుకే ఎప్పుడూ రొటీన్ కథలు కాకుండా కొత్త కథలు తీసుకొని ముందుకు వెళ్లే ఆలోచనలో మెగాస్టార్ చిరంజీవి ఉన్నారని ఈ నేపథ్యంలోనే ఆయన భారీ ప్లాన్ చేస్తున్నారని టాలీవుడ్ జనాలు అంటున్నారు. సినిమా కెరీర్ లో చిరంజీవి ప్రస్తుతం ఎన్నడూ లేనివిధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనే మాట కూడా కాస్త వాస్తవం. చిరంజీవి ప్రస్తుతం తెలుగు సినిమాలో మకుటం లేని మహారాజుగా ఉన్నా సరే కొన్ని కొన్ని విషయాల్లో ఆయనకు అనుకూలంగా పరిస్థితులు లేకపోవడం గతంలో మాదిరిగా చిరంజీవి సినిమాలకు క్రేజ్ లేకపోవడం వంటివి కాస్త ఇబ్బందికరంగా మారే అవకాశముంది.

అయితే ఇప్పుడు చిరంజీవి కొన్ని కొన్ని విషయాల్లో ఎప్పుడూ లేనివిధంగా బయోపిక్ లకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రముఖ కథలను తెరకెక్కించే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని భావిస్తున్నారని ఈ నేపథ్యంలోనే ఒక ప్రముఖుడి బయోపిక్ కోసం చిరంజీవి ప్రయత్నాలు చేస్తున్నారని త్వరలోనే దీనికి సంబంధించి కచ్చితంగా ముందడుగు పడటమే కాకుండా దీనికి సంబంధించి పరుచూరి బ్రదర్స్ ఒక కథ కూడా సిద్ధం చేసి ఇచ్చారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: