తెలుగు సినిమా పరిశ్రమలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలకు సంబంధించి ఉండే క్రేజ్ గాని ఆ సినిమాల్లో ఉండే సందడి అంతా ఇంతా కాదు. సార్ హీరోలు చాలామంది త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక సినిమా చేస్తే చాలు అనుకునే పరిస్థితి కూడా గత కొన్ని రోజులుగా ఉంది అనే మాట వాస్తవం. సినిమా విజయం సాధించిన లేకపోతే ఇబ్బంది పెట్టినా సరే ఆయన క్రేజ్ మాత్రం ఎక్కడా కూడా కొంచెం కూడా తగ్గే అవకాశం లేదు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ హీరోగా ఒక సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా త్వరలోనే ఆయన నుంచి మరో అధికారిక ప్రకటన రానుందని ప్రచారం కూడా జరుగుతోంది.

ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ రెండు సినిమాలకు సంబంధించి కథలు కూడా సిద్ధం చేసి పట్టుకున్నారంటే ఈ సినిమాలకు సంబంధించి అన్ని సిద్ధమయ్యాయి ఒక ప్రముఖ నిర్మాత దాదాపు రెండు సినిమాలకు పెట్టుబడి పెట్టబోతున్నారని గతంలో ఆయన చేసిన నిర్మాత కాకుండా ఈ సినిమాలకు కొత్త నిర్మాతతో ముందుకు వెళ్లే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ రెండు సినిమాలకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ లేదా ఈ రెండు సినిమాలు కూడా ప్రముఖ హీరోలతో కాకుండా చిన్న హీరోలతో చేయడానికి సిద్ధంగా ఉన్నారని అంటున్నారు.

అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ చేయబోయే సినిమాలకు సంబంధించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాక పోయినా ఆయన సైలెంట్ గా ఉండటం పట్ల మాత్రం కాస్త తెలుగు సినిమా పరిశ్రమలో చర్చలు జరుగుతున్నాయి. రాజకీయంగా ఒక సినిమాను తెరకెక్కించేందుకు త్రివిక్రమ్ శ్రీనివాస్ సిద్ధమవుతున్నారని అరవింద సమేత తరహాలో ఆ సినిమాను ముందుకు తీసుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని అయితే ఆ సినిమా విషయంలో మాత్రం కచ్చితంగా ఆయన ఒకటికి పదిసార్లు ఆలోచించిన తర్వాతే ముందుకు వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: