అక్కినేని నాగచైతన్య తో విడాకుల తర్వాత సమంత కెరీర్ కు సంబంధించి అనేక ప్రచారాలు జరుగుతున్నాయి సరే సమంత మాత్రం చాలా కూల్ గా ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం సమంత కెరీర్ లో కొన్ని సినిమాలు కీలకంగా మారిన ఈ సినిమాల తర్వాత ఆమె రెండో పెళ్లి కూడా చేసుకునే అవకాశం ఉందని అయితే పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె ఇక్కడ ఉండకుండా విదేశాల్లో స్థిరపడే ప్లాన్ చేస్తోందని అక్కడ కొన్ని వ్యాపారాలు చేసుకుంటూ అక్కడే ఉండటానికి రెడీగా ఉందని కూడా ప్రచారం ఉంది.

గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఏ విషయాన్ని కూడా మీడియా ముందు ప్రకటించడానికి ఆమె సిద్ధంగా లేరని కాబట్టి ఫ్యూచర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడమే కాకుండా కొన్ని కొన్ని అంశాలకు సంబంధించి ఎటువంటి లీక్ లేకుండా చేసుకుంటున్నారని సమాచారం. అయితే సమంతా ప్రస్తుతం హిందూ మతం లోకి మారే ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం కూడా తెలుగు సినిమా వర్గాల్లో గట్టిగానే జరుగుతోంది. వివాదాలకు సమంత ఎప్పుడూ దూరంగానే ఉన్నా సరే ఈ మధ్య కాలంలో కొన్ని కొన్ని విషయాల్లో అభిమానులు చేసిన ఓవర్యాక్షన్ వల్ల ఆమె బాగా ఇబ్బంది పడింది..

ఈ నేపథ్యంలోనే ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు లేకుండా ఉండేందుకు ఆమె ప్లాన్ చేసుకుంటున్నారని త్వరలోనే ఆమె నుంచి కొత్త సినిమాలకు సంబంధించిన పోస్టర్లు కూడా విడుదలయ్యే అవకాశం ఉందని అటు తమిళంలో కూడా వినూత్న పాత్రలు చేయడానికి అలాగే కన్నడలో కూడా కొన్ని కీలక పాత్రలు చేయడానికి రెడీగా ఉన్నారని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా సరే సమంతా విడాకుల తర్వాత సైలెంట్ గా ఫ్యూచర్ ప్లాన్ చేసుకోవడం అలాగే ఎటువంటి హడావుడి కూడా సోషల్ మీడియాలో లేకుండా ఉండేందుకు ప్రయత్నం చేయడం మీడియాకు కూడా దూరంగా ఉండటానికి ఇష్టపడటం వంటివి చర్చనీయాంశంగా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: