ఇక ఎట్టకేలకు బాలీవుడ్ హాట్ హీరోయిన్ కత్రినా కైఫ్ పెళ్లి చేసుకోబోతుంది.బాలీవుడ్‌ యంగ్ హీరో విక్కీ కౌశల్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్‌ పీకల్లోతూ ప్రేమలో మునిగి తేలి త్వరలో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. చాలా రోజుల నుండి ఈ విషయంలో ఎన్నో పుకార్లు వస్తున్నా కాని ఎక్కడా ఎలాంటి స్పష్టత రావడం లేదు.అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ పెళ్లి గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి.ఇక వాటి ప్రకారం చూసినట్లయితే బాలీవుడ్‌లో కొంతమంది ప్రముఖులకు ఈ పెళ్లికి ఇన్విటేషన్‌ అనేది రాలేదట. ఇప్పటికి వారిలో ఒకరిద్దరి పేర్లు మీరు ఊహించే ఉంటారు. రాజస్థాన్లోని సిక్స్ సెన్సెస్‌ ఫోర్ట్‌లో విక్కీ - కత్రినా కైఫ్ వివాహం జరుగుతుంది.ఇక ఈ విషయం పాతదే.దీని కోసం ఆ ఫోర్ట్‌ను ఇప్పటికే ఈవెంట్‌ ఆర్గనైజర్లు తమ అధీనంలోకి తీసుకున్నారని సమాచారం తెలుస్తుంది.

ఈ మధ్య విక్కీ ఇంటికి కత్రినా కుటుంబం వచ్చిందని వారి సన్నిహితులు చెబుతున్నారు. దీంతో ఎక్కడో ఒక దగ్గర చిన్నగా అనుమానం కూడా తీరి పోవడం జరిగిందని చెబుతున్నారు. అయితే ఇక్కడే మరోక విషయం అందరికి ఆసక్తి కలిగిస్తోంది. ఈ పెళ్లికి కత్రినా కైఫ్ మాజీ బాయ్‌ఫ్రెండ్‌ సల్మాన్‌ ఖాన్‌కు ఇప్పటివరకు ఇన్విటేషన్‌ అనేది అందలేదట. ఇక ఈ విషయం ఇప్పటికే బయటకు కూడా వచ్చింది.అయితే కత్రినా కైఫ్ మరో స్నేహితుడు రణ్‌వీర్‌ సింగ్ కి కూడా ఇన్విటేషన్‌ అందలేదట. అంటే అతని భార్య దీపికా పదుకొణె కూడా ఈ పెళ్లికి హాజరు కాకపోవచ్చు. అలాగే విక్కీ కౌశల్‌ మాజీ గాళ్‌ ఫ్రెండ్‌ అయినా హర్లీన్‌ సేతికి కూడా ఇన్విటేషన్‌ అనేది అందలేదట. ఇంకొంత మంది ప్రముఖులకు కూడా ఇన్విటేషన్లు రాలేదని సమచారం తెలుస్తుంది.ఇక రాబోయే రోజుల్లో ఈ పెళ్ళికి సంబంధించిన వివరాలు బయటకు వస్తాయి.తెలుగులో మల్లీశ్వరి సినిమాతో హీరోయిన్ గా పరిచయమైనా కత్రినా కైఫ్ తరువాత బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోయిన సంగతి తెలిసిందే..

మరింత సమాచారం తెలుసుకోండి: