హాట్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్, వరుణ్ తేజ్ హీరో గా విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం లో తెరకెక్కిన కంచె సినిమా తో తెలుగు ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు దక్కించుకుంది, ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించడం మాత్రమే కాకుండా ఈ ముద్దు గుమ్మకు కూడా మంచి పేరు తీసుకువచ్చింది.  కంచె సినిమా తో టాలీవుడ్ లో తన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న ఈ ముద్దు గుమ్మ ఆ తర్వాత నక్షత్రం, జయ జానకి నాయక వంటి సినిమాల్లో నటించి తన క్రేజ్ ను మరింత గా పెంచుతుంది. అయితే ఈ ముద్దు గుమ్మ తాజా గా నందమూరి నట సింహం బాలకృష్ణ హీరో గా టాలీవుడ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం లో తెరకెక్కిన అఖండ సినిమా లో హీరోయిన్ గా నటించింది.

డిసెంబర్ 2వ తేదీన థియేటర్ లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లను రాబడుతోంది,  ఇలా అఖండ సినిమా తో బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్న ప్రగ్యా జైస్వాల్సినిమా ను మరింత గా జనాల్లోకి తీసుకెళ్లేందుకు తన వంతుగా సినిమా ను ప్రమోట్ చేస్తోంది. అయితే ఇందులో భాగంగా తాజా గా అఖండ చిత్ర బృందం తెలుగు ప్రముఖ  ఓటిటి ఆహా లో బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఆన్ స్టాపబుల్ షో కు అఖండ చిత్రబృందం గెస్ట్ లుగా వెళ్లారు. అయితే ఈ టాక్ షో కు అఖండ సినిమా హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కూడా వెళ్ళింది, అందులో భాగంగా ఈ ముద్దు గుమ్మ  క్లాస్ లుక్ లో అదిరి పోయే చీరకట్టు లో ఈ షో కు వెళ్ళింది, ప్రస్తుతం ప్రగ్యా జైస్వాల్ కు సంబంధించిన ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: