ఈమధ్య వరస ఫ్లాప్ లతో సతమతమైపోతున్న నాని కెరియర్ కు సంబంధించి క్రిస్మస్ కు విడుదల కాబోతున్న ‘శ్యామ్ సింగ్ రాయ్’ అత్యంత కీలకంగా మారింది. ఈమూవీకి మంచి ఓటీటీ ఆఫర్లు వచ్చినప్పటికీ ఎట్టి పరిస్థితులలోను ఈమూవీని ధియేటర్లలోనే విడుదలచేయాలి అన్న పట్టుదలతో నాని ఈమూవీని క్రిస్మస్ రేస్ లో నిలబెట్టాడు.


గతంలో తనకు కలిసివచ్చిన క్రిస్మస్ సీజన్ ను నమ్ముకుని నాని ఈసారి మళ్ళీ ధైర్యం చేస్తున్నాడు. అయితే ఈసినిమాకు పోటీగా వరుణ్ తేజ్ ‘గని’ విడుదల అవుతూ ఉండటంతో ఇప్పటికే నాని తెగ టెన్షన్ పడుతున్నాడు. ఇప్పుడు ఈ పరిస్థితులకుతోడు నానీకి బాలీవుడ్ మూవీ ‘83’ టెన్షన్ కూడ మొదలైనట్లు తెలుస్తోంది.


సినిమా కూడ క్రిస్మస్ సీజన్ ను టార్గెట్ చేస్తూ విడుదల కాబోతోంది. ఈమూవీ ట్రైలర్ లేటెస్ట్ గా విడుదల అయి అందరికీ విపరీతంగా నచ్చడంతో ఈమూవీ పై భారీ స్థాయిలో అంచనాలు పెరిగిపోతున్నాయి. 1983వ సంవత్సరంలో జరిగిన వరల్డ్ క్రికెట్ టోర్నమెంట్ లో అండర్ డాగ్‌ గా ఆ టోర్నమెంట్ లోకి అడుగుపెట్టిన కపీల్ దేవ్ సారథ్యంలోని అప్పటి క్రికెట్ టీమ్ ఎవరు ఊహించని విధంగా మన భారత్ కు మొట్టమొదటి కప్పును తీసుకు వచ్చారు.



ఇప్పుడు ఆ విషయాలకు సంబంధించిన అంశాలతో రూపొందించిన ఈ ‘83’ మూవీని మొదట్లో ఎవరు పట్టించుకోలేదు కానీ లేటెస్ట్ గా విడుదలైన ఈమూవీ ట్రైలర్ చూసిన తరువాత మన దేశంలో అందరు భాషా భేదం లేకుండా ఈమూవీ పై అంచనాలు పెంచుకున్నారు. క్రికెట్ అంటే భారతీయులకు ఉన్న ఎమోషన్ ఎలాంటిదో చెప్పాల్సిన పని లేదు. వాళ్ల ఎమోషన్‌ను పీక్స్‌ కు తీసుకెళ్లే సినిమాలా ఇది కనిపిస్తోంది అంటూ అప్పుడే కామెంట్స్ వస్తున్నాయి. ఈమూవీని తెలుగులో కూడ డబ్ చేసి విడుదల చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఈమూవీ నాని సినిమాకు గట్టి పోటీ ఇచ్చే ఆస్కారం ఉంది అంటూ వస్తున్న వార్తలు నానీని కలవర పెడుతున్నట్లు టాక్..



మరింత సమాచారం తెలుసుకోండి: