బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఏ చిన్న విషయం జరిగినా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్న విషయం తెలిసిందే. ఇక  పెళ్లి వేడుకలు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. తెలుగు సినీ ఇండస్ట్రీలో వుండే సెలబ్రిటీలతో పోలిస్తే..బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది తారలు డేటింగ్ చేసుకుని, ఆ తర్వాత పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఇలా వీరు ఆ స్థాయిలో అందుకుంటున్న క్రేజ్ గురించి మాటల్లో చెప్పలేము.. ఒకరకంగా చెప్పాలంటే వారు తమ పెళ్లి వేడుకలను కూడా వ్యాపారంగా మార్చుకుంటున్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి.. అంతే కాదు ఎవరైనా స్టార్ హీరోలు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. వారి పెళ్లికి ఒక్క పైసా ఖర్చు లేకుండా పెళ్లి చేసే కంపెనీలు కూడా చాలానే ఉన్నాయి.


పెళ్లిళ్ల ద్వారా వచ్చే ఫోటోలు, వీడియో లకు సోషల్ మీడియాలో బాగానే బిజినెస్ జరుగుతుంది అని చెప్పవచ్చు.  ఇక తాజాగా కత్రినా కైఫ్ -  విక్కీ కౌశల్ పెళ్లి ఫోటోల కోసం పెద్ద పెద్ద  మీడియా సంస్థలు చాలా గట్టిగానే పోటీపడుతున్నాయి. ఇకపోతే తమ ఫొటోలను లీక్ చేయకూడదని, అనుమతి లేకుండా మొబైల్స్ పెళ్లి వేడుకలకు తీసుకు రాకూడదు అని కత్రినాకైఫ్ - విక్కీ కౌశల్ పెట్టిన షరతులు తెలిసిందే.. ఈ నేపథ్యంలోనే వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఎక్కడా లీక్ అయ్యే అవకాశం లేదు.. అందుకే  ఈ ఫోటోలను ,వీడియోలను తమ సోషల్ నెట్ వర్క్ ద్వారా ప్రచారం చేసి, మంచి క్రేజ్ ను సంపాదించుకోవడానికి  ప్రముఖ ఓటీటీ సంస్థలు పోటీ పడుతున్నాయి.


ఏకంగా వీరి పెళ్లి వీడియో లను  స్ట్రీమింగ్ చేయడానికి ఒక బడా మీడియా  సంస్థ ఏకంగా 100 కోట్ల రూపాయలను ఆఫర్ చేసినట్లు సమాచారం. ఇప్పటివరకు ఏ సెలబ్రిటీ కి దక్కని రేంజ్ లో వీరికి బంపర్ ఆఫర్ దక్కడం గమనార్హం. కత్రినా - విక్కీ కూడా తమ పెళ్లిని  బిజినెస్ గా మార్చుకోవడం సినీ ఇండస్ట్రీలో షాక్ గా మారిందట..

మరింత సమాచారం తెలుసుకోండి: