ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల మారి ఇక ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుని స్టార్ హీరోయిన్ రేంజ్ సంపాదించాలంటే సినిమాలో అందాల ఆరబోత చేయాల్సిందే అన్న భావన ఉండేది. ఇలా ఒకప్పుడు గ్లామర్ షో చేసిన వారు చాలా మంది స్టార్ హీరోయిన్ గా ఎదిగిన వారు కూడా ఉన్నారు. కానీ నేటి ఈ రోజుల్లో మాత్రం ఎంతో మంది హీరోయిన్లు ఇదంతా వట్టి మాటలే అన్న విషయాన్ని నిరూపించారు. ఎందుకంటే టాలెంట్ ఉంటే అందాల ఆరబోతతో అసలు పని లేదు అంటూ ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్లు నిరూపించారు. అదే సమయంలో కొంతమంది హీరోయిన్లు పాత్ర డిమాండ్ చేస్తే గ్లామర్ షో చేయడానికి సిద్ధమైపోతున్నారు.



 ఇలా కొంతమంది ఇక అందాల ఆరబోత లేని పాత్రలు చేసుకుంటూ ముందుకు సాగుతుంటే మరికొంతమంది అందాల ఆరబోతతో నే వరుస అవకాశాలు అనుకుంటున్నరూ. అదే సమయంలో కొంతమంది హీరోయిన్లు మాత్రం పాత్ర కోసం బోల్డ్ గా నటించడానికి ఇష్టపడుతున్నారు. అయితే తాను కూడా బోల్డ్ పాత్రలో నటించడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చింది విజయ్ దేవరకొండ హీరోయిన్ ప్రియాంక జవాల్కర్.. టాక్సీ వాలా సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. సినిమా హిట్ అయి నప్పటికీ ఈ అమ్మడికి అవకాశాలు రాలేదు.



ఇటీవల ఎస్ ఆర్ కళ్యాణమండపం అనే సినిమాతో చాలా రోజుల తర్వాత మళ్లీ తెలుగు ప్రేక్షకులను అలరించింది. మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అయితే తాజాగా తాను బోల్డ్ పాత్రలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ చెప్పింది ప్రియాంక జవాల్కర్. కథ డిమాండ్ చేస్తే ఎలాంటి సీన్స్ చేయడానికైనా అభ్యంతరం లేదు అంటూ తెలిపింది. ప్రస్తుతం హీరో శివ కందుకూరి కి జంటగా గమనం అనే సినిమాలో నటిస్తుంది ప్రియాంక జవాల్కర్. అయితే ఇప్పటికే అవకాశాలు లేక సతమతమవుతున్న ఈ హీరోయిన్ ఇక ఇప్పుడు గ్లామర్ షో కి కూడా సిద్ధం అంటూ చెప్పడంతో దర్శక నిర్మాతలు ఇప్పుడైనా అవకాశాలు ఇస్తారా ఇవ్వరా అన్నది చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: