టాలీవుడ్
సినిమా పరిశ్రమ లో వయసు పెరుగుతున్నా కూడా పట్టించుకోకుండా వరుస
సినిమా లు చేస్తున్నారు మన సీనియర్ హీరోలు. ఒక్కొక్కరు తమ చేతి లో మూడు సినిమాలను పెట్టుకోవడం తోనే అర్థమవుతుంది వారు ఏవిధంగా సినిమాలో దూసుకు వెళ్లాలని అనుకున్నారో.
మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి యంగ్
హీరో లకు ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ సినిమాలు ఒప్పుకుంటూ వరుస సినిమాలు చేసే విధంగా స్టార్ గా దూసుకుపోయే విధంగా ప్రణాళికలు రూపొందించుకున్నారు.
అదే విధంగా ఇప్పుడు
రవితేజ కూడా ఏకంగా నాలుగు సినిమాల ను సెట్స్ మీదకు తీసుకు వెళుతూ అందరినీ ఎంతగానో ఆశ్చర్య పరుస్తున్నాడు.
క్రాక్ సినిమా తో ఈ సంవత్సరం భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న
రవితేజ ఆ విజయోత్సాహంలో ఏకంగా నాలుగు సినిమాలు ఒప్పుకుని మరొకసారి భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకునేందుకు రెడీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే
రమేష్ వర్మ దర్శకత్వంలో కిలాడి అనే
సినిమా చేస్తున్న
రవితేజ ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుండడం విశేషం.
అయితే ఈ
సినిమా విడుదలైన నెల రోజుల వ్యవధిలోనే
రవితేజ నటించిన మరొక సినిమాను విడుదల చేసే విధం గా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు.
శరత్ మండవ అనే దర్శకుడితో కలిసి
రవితేజ రామారావు ఆన్ డ్యూటీ అనే చిత్రాన్ని చేశారు. ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని పంచే విధం గా ఈ
సినిమా ఉంటుందని ముందు నుంచి చెబుతుండడం తో ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ
సినిమా తర్వాత త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ధమాకా చిత్రాన్ని కూడా అతి తక్కువ వ్యవధిలో విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. ఆ విధంగా ఒకే నెల ఇన్ని సినిమాలు విడుదల చేస్తూ
రవితేజ తన ఫామ్ కొనసాగిస్తున్నాడు.