సన్నీ.. ఈ పేరు ఒక్కప్పుడు చాలా అంటే చాలా తక్కువ మందికే తెలుసు. కానీ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలల్లో ఈ పేరు మారుమ్రోగిపోతుంది. దానికి కారణం బిగ్ బాస్ అని చెప్పక తప్పదు. తెలుగులోనే అతి పెద్ద రియాలిటీ షో గా దూసుకుపోతున్న బిగ్ బాస్ లోకి వెళ్లాలి అని చాలా మంది కోరుకుంటారు. ఇక బిగ్ బాస్ సీజన్ 5 లో కి అడుగుపెట్టిన సన్నీ..మొదటి నుండి తనదైన స్టైల్లో ఆట ఆడుతూ..అందరిని నవ్విస్తూ ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం బయట వింటున్న టాక్ ప్రకారం సన్నీ నే విన్నర్ అంటూ ప్రజలు ఫిక్స్ అయిపోయారు.

ఇది ఇలా ఉంటే సన్నీ ని తన కూతురు కి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నారట అర్ధపావు భాగ్యం. అదే కార్తిక దీపం సీరియల్ లో దీపకు సవతి తల్లిగా నటిస్తుందే ఆమె. ఆమె అసలు పేరు ఉమాదేవి. ఆమె కూడా బిగ్ బాస్ సీజన్ 5 లోకి ఒక కంటెస్టెంట్ గా వెళ్లారు. కానీ ఆమె ఎక్కువ రోజులు అక్కడ ఉండలేకపోయారు. ఎలిమినేట్ అయ్యి ఇంటికి వచ్చేసారు. ఇక రీసెంట్ గా ఓ ఇంటర్వ్యుల్లో మాట్లాడుతూ..ఆమె తన పెద్ద కూతురిని సన్నీకి ఇచ్చి పెళ్లి చేద్దాం అని అనుకున్నారట.

కానీ, కూతురు వచ్చి సన్నీ ని అన్నయ్య అని పిలవడంతో అక్కడ టోటల్ కధ రివర్స్ అయ్యిందట. "ఇక సన్నీ ఆరోజు నుంచి నా కూతుళ్లను సిస్టర్స్ గా భావిస్తున్నారు. నా బిడ్డలు కూడా  సన్నీ ని అన్నగా ఫిక్సయిపోయారు" అంటూ చెప్పుకొచ్చింది ఉమాదేవి. అలా అత్త అవ్వాలి అనుకున్న  సన్నీకి కూతురు ఇచ్చిన ట్వీస్ట్ తో పిన్నీ అయిపోయారు భాగ్యం. ఒకవేళ తన కూతురు సన్నీని అన్న అని పిలవకపోయి ఉంటే ఇప్పుడు సీన్‌ ఇంకోలా ఉండేది అంటూ క్లారిటీ ఇచ్చింది ఉమాదేవి.

మరింత సమాచారం తెలుసుకోండి: