టాలీవుడ్ అగ్ర‌ద‌ర్శ‌కుల‌లో ఒక‌రూ సురేంద‌ర్ రెడ్డి. అత‌నొక్క‌డే సినిమాతో ద‌ర్శ‌కునిగా తెలుగు సినిమా రంగంలోకి ప్ర‌వేశించారు సురేంద‌ర్‌రెడ్డి. తెలంగాణ‌లోని క‌రీంన‌గర్ జిల్లా మాచినేప‌ల్లి గ్రామానికి చెందిన వీరారెడ్డి కుమారుడు సురేంద‌ర్‌రెడ్డి. ఇతనికి ఒక అక్క‌, ఇద్ద‌రు అన్న‌లు, ఇద్ద‌రు చెల్లెలు ఉన్నారు. తండ్రి రాజ‌కీయంగా ప‌లుకుబ‌డి ఉండేది. ప‌ద‌వ‌త‌ర‌గ‌తి వ‌ర‌కు ఇత‌డు స‌ర‌స్వ‌తి గురుకుల విద్యాల‌యంలో చ‌దివాడు. ఇంట‌ర్మీడియ‌ట్ నుంచి చ‌దువు స‌రిగ్గా చ‌ద‌వ‌క‌పోవ‌డంతో.. అటో ఇటో ఇంట‌ర్ పూర్తి చేసాడు. కానీ డిగ్రీ మ‌ధ్య‌లోనే చ‌దువుకు గుడ్‌బై చెప్పి హైద‌రాబాద్‌కు వ‌చ్చాడు. అయితే ఇత‌నికి నాట‌కాలు, సాహిత్యం, సినిమాలు వంటి వాటిపై ప్ర‌త్యేక‌మైన ఆస‌క్తి  ఉండేది కాదు. కానీ మ‌ణిర‌త్నం ఘ‌ర్ష‌ణ‌, రామ్‌గోపాల్ వ‌ర్మ శివ ఇతడి మీద ప్ర‌భావం చూపించాయి.

సినిమా విజ‌యంలో ద‌ర్శ‌కుడికి పాత్ర‌ను త‌లుచుకుంటే సృష్టించ‌గ‌ల అద్భుతాల‌కు అవి నిద‌ర్శ‌నాలు అని.. ఆ సినిమాలు చూసిన‌ప్పుడే సినిమా రంగంలోకి వెళ్లి ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకోవాల‌ని అనుకునేవాడ‌ట సురేంద‌ర్‌రెడ్డి. హైద‌రాబాద్ చేరుకున్న త‌రువాత సినిమాల్లో అవ‌కాశం అనేది అంత సులువుగా రాద‌ని తెలియ‌లేదు. ఇంట్లో వాళ్లు ఎవ్వ‌రూ ఏమి ఎదురు చెప్ప‌లేదు. హైద‌రాబాద్‌లో ఇత‌ని భావ అపార్టుమెంట్ ఓ అపార్టుమెంట్‌లో ఉండేవాడు. చేతిలో డ‌బ్బు ఉన్న స‌మ‌యంలో అద్దె చెల్లించేవాడు. లేన‌ప్పుడు మాత్రం కాముగా ఉండేవాడు. తాను ఏమిటో నిరూపించుకోవాల‌ని.. త‌న కాళ్ల మీద తాను నిల‌బ‌డాల‌ని న‌గ‌రానికి వ‌చ్చాడు కాబ‌ట్టి త‌ల్లిదండ్రుల‌ను డ‌బ్బులు అడిగేవాడు కాదు. ఫ్రెండ్స్ స‌హాకారంతో గ‌డిపేవాడు.. ఆ త‌రువాత కొన్ని సంద‌ర్భాల‌లో ప‌స్తులున్న ప‌రిస్థితులు కూడా ఉన్నాయ‌ట‌.

 చేతిలో డ‌బ్బులు స‌రిపోక భోజ‌నం కూడా చేయ‌ని రోజులు చాలానే ఉన్నాయి. అంద‌రూ అన్నీ ఉన్నాయని.. ఎందుకు ఇలా ఇబ్బందులు ఎదుర్కుంటున్నావ‌ని పేర్కొనేవాళ్లు. అయితే ఇత‌ని ప‌ట్టుద‌ల అన్నింటినీ భ‌రించేలా చేసిన‌ది. తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ అప్ప‌ట్లో మ‌ద్రాస్ నుంచి హైద‌రాబాద్‌కు వ‌చ్చిన‌ది. ఇప్పుడు ఉన్నంత సౌక‌ర్య‌వంత‌మైన వాతావ‌ర‌ణం అప్ప‌ట్లో లేదు. ఎవ్వ‌రూ కూడా ద‌గ్గ‌రికీ రానిచ్చే వారు కాద‌ట‌. అలాంటి సంద‌ర్భాల‌లో సినీ ఇండ‌స్ట్రీకి ర‌చ‌యిత‌గా ప‌రిచ‌య‌మై.. ఆ త‌రువాత ద‌ర్శ‌కుడిగా ఎదిగారు సురేంద‌ర్‌రెడ్డి. తీసిన మొద‌టి చిత్రంతోనే హిట్ సాధించి ఇప్పుడు టాలీవుడ్‌లో అగ్ర‌ద‌ర్శ‌కుల స‌ర‌స‌న చేరారు సురేంద‌ర్‌రెడ్డి. ఆయ‌న తీసే సినిమాలు హిట్‌.. ఫ‌ట్ అని ఆలోచించ‌కుండా మొద‌టి సినిమా నుంచి ఏదో ఒక కొత్త ర‌కమైన కాన్సెప్ట్‌ల‌తోనే కొత్త‌ద‌నాన్ని ప్రేక్ష‌కుల‌కు ఇవ్వాల‌నే దృక్ప‌థంతో సినిమాలు తీస్తాడు ద‌ర్శ‌కుడు సురేంద‌ర్‌రెడ్డి. ఇవాళ ఆయ‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా ఇండియా హెరాల్డ్ ద‌ర్శ‌కుడు సురేంద‌ర్‌రెడ్డికి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలుపుతొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: