సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి..తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన పేజీని లిఖించుకున్న లెజండరీ హీరో . ఇక రీ ఎంట్రీ తరువాత మెగాస్టార్ సినిమా ల విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటూ స్టోరీలు సెలక్ట్ చేసుకుంటున్నారు. సినిమా లో నటించడమే కాదు.. ఆ సినిమాలోని కధ వల్ల ప్రజలకు ఏదైన విషయం చెప్పగలిగేలా చూస్తున్నారు.

మెసేజ్ ఒరియంటెడ్ సినిమాలకు ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే వరుస సినిమాలకు సంతకం చేస్తూ..యంగ్ హీరోలు కూడా చేయలేని విధంగా సినిమాలు ఒప్పుకుంటూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. సినిమాకు సైన్ చేయడమే కాదు ఆ సినిమా షూటింగ్ పనులు కూడా మొదలు పెట్టేస్తున్నారు చిరంజీవి ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సరికొత్త రికార్డ్ సృష్టించాడు.  ప్రపంచంలో ఏ హీరో చేయని విధంగా ఒకే నెలలో అత్యధిక షూటింగ్ లు స్టార్ట్ చేసిన హీరోగా మెగాస్టార్ సంచలన రికార్డ్ సృష్టించారు. ఇక దీంతో మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

కొరటాల శివతో ఆచార్య సినిమా చేస్తున్న చిరు..ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రిలో విడుద‌ల కాబోతుంది. ఇక ఇదే టైంలో మిగత  క‌మిటైన సినిమాలను పూర్తి చేసే ప‌నిలో  చిరు నిమగ్నమైయాడు. ప్రస్తుతం చిరంజీవి షూటింగ్ లో ఉన్న సినిమాలు..‘లూసిఫర్’కు రీమెక్ గా వస్తున్న గాడ్ ఫాదర్. అలాగే యంగ్ డైరెక్టర్ బాబీ తో చిరంజీవి 154 వ సినిమా షుటింగ్ సెట్లో అడుగుపెట్టారు మెగాస్టార్. అంతేకాదు  మెహర్ రమేష్ దర్శకత్వంలో రాబోతున్న ‘బోళా శంకర్’ సినిమా కూడా షూటింగ్ పనుల్లో ఉంది. ఇక  డిసెంబర్ లోనే ఆయన నాలుగు చిత్రాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి.  దీంతో మెగాస్టార్ సరికొత్త చరిత్ర సృష్టించారు. ఏదిఏమైనా మెగాస్టారా .. మజాకానా..ఇలాంటి రికార్డులు ఆయన ఒక్కడికే సాధ్యం.



 

మరింత సమాచారం తెలుసుకోండి: