2021 సంవత్సరం ఏ హీరోకైనా బాగా కలిసి వచ్చింది అంటే ముందుగా వినిపించే పేరు మాత్రం అఖిల్ అనే విషయం తెలిసిందే. ఎందుకంటే తెలుగు చిత్ర పరిశ్రమలో అక్కినేని వారసుడిగా ఎంట్రీ ఇచ్చాడు అఖిల్. అఖిల్ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఇక భారీ అంచనాల మధ్య విడుదలైన అఖిల్ సినిమా కాస్త చివరికి ఫ్లాప్ గానే మిగిలిపోయింది. ఇక ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో మొదటి హిట్ సాధించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు అఖిల్. కానీ ఏం చేస్తాం అఖిల్ ఎంత కష్టపడినా అదృష్టం మాత్రం కలిసి రాలేదు.



 చివరికి అఖిల్ చేసిన ప్రతి సినిమా కూడా ఫ్లాప్ గానే మిగిలిపోతుంది. అక్కినేని బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ కూడా అఖిల్ హిట్ కొట్టకపోవటం గమనార్హం. ఈ క్రమంలోనే నాగార్జున రంగంలోకి దిగి బొమ్మరిల్లు భాస్కర్ తో ఒక కథను సిద్ధం చేశారు. ఇక ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో లక్కీ ఛార్మ్ గా కొనసాగుతున్న పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.ఇకపోతే ఈ సినిమాపైనే అఖిల్ కెరియర్ ఎంతగానో డిపెండ్ అయిపోయింది. అయితే ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.



 ఎన్నో ఏళ్ల నుంచి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నిస్తున్ అఖిల్ కి  తన కెరీర్ లో మొదటి విజయంగా నిలిచింది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా. కేవలం హీరో అఖిల్ కు మాత్రమే కాదు దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ కి కూడా చాలా రోజుల తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో మంచి విజయం లభించింది అనే చెప్పాలి. ఇలా ఓ వైపు దర్శకుడికి మరోవైపు హీరో అఖిల్ కి కూడా 2021 సంవత్సరం ఎంతగానో కలిసి వచ్చింది. అఖిల్ ఏళ్ల నిరీక్షణకు ఈ ఏడాది తెర పడినట్లు  అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: