తెలుగు సినిమాలు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తన మార్కు వేసినా సరే కొన్ని కొన్ని విషయాల్లో ఆయన దర్శకత్వం కాస్త అభిమానులను ఖంగారు పెడుతూ ఉంటుంది అనే మాట వాస్తవం. తెలుగు సినిమాలు ఈ మధ్య కాలంలో సినిమాలను మరీ హింసా మార్గంలో తీసే దర్శకుడు బోయపాటి శ్రీను ముందు వరుసలో ఉంటారు. అయితే ఈ విషయంలో కొంత మంది హీరోలు కూడా కాస్త ఇబ్బంది పడుతున్నారు అని ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. తెలుగు సినిమాలు బోయపాటి శ్రీను ఈ మధ్య కాలంలో టాప్ డైరెక్టర్ గా మారిన సరే కొన్ని కొన్ని విషయాల్లో ఆయన తన అనుకున్న విధంగానే సినిమాలు చేయడం ఇబ్బందికరంగా మారింది.

అయితే ఇప్పుడు చాలా మంది హీరోలు బోయపాటి శ్రీను తో సినిమా చేసేందుకు ముందుకు రాకపోవడం అదేవిధంగా బోయపాటి శ్రీను విషయంలో కాస్త సీరియస్ గా వుండటం వంటివి టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఒక స్టార్ హీరో తో సినిమా చేసేందుకు ఇటీవల బోయపాటి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సరే  స్టార్ హీరో అఖండ సినిమా చూసిన తర్వాత వెనక్కు తగ్గారు అని అహింసా మార్గంలో సినిమా కథ ఆధారంగా సినిమా ఉంటే బాగుంటుందని చెప్పినట్లుగా తెలుస్తోంది.

అదేవిధంగా అక్కడ సినిమాలో కథ లేకపోయినా సరే యాక్షన్ సన్నివేశాలు సినిమాలో విజయం దిశగా నడిపించే కొంతమంది హీరోలు కథ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడమే కాకుండా యాక్షన్ సన్నివేశాల విషయంలో ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో బోయపాటి శ్రీను సినిమాలు చేసే విషయంలో కథ మీద దృష్టి పెట్టాలని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తే అభిమానులు కూడా ఆదరించే పరిస్థితి ఉండకపోవచ్చని పలువురు కోరుతున్నారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను మెగా హీరోతో సినిమా చేసేందుకు కథ సిద్ధం చేశారని అయితే యాక్షన్ సన్నివేశాల కారణంగా సినిమా వాయిదా పడుతూ వస్తోంది అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: