సోషల్ మీడియాలో ఏ చిన్న విషయం బయటకు వచ్చినా సరే దానికి సంబంధించి జరిగే చర్చలు అదేవిధంగా దానికి సంబంధించిన అధికారిక ప్రకటన రాకపోయినా సరే కొంతమంది చేసే హడావుడి అంతా ఇంతా కాదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ కు సంబంధించి అదే విధంగా కొంత మంది హీరోలకు సంబంధించిన చిన్న విషయాలను పెద్దగా హైలెట్ చేస్తూ కొంతమంది సందడి చేస్తూ ఉంటారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉండగా ఆయన వైవాహిక జీవితానికి సంబంధించిన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కూడా అనేక ప్రచారాలు జరుగుతూనే ఉంటాయి.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ తో మాట్లాడుతున్నారని తన పిల్లల కోసం రేణుదేశాయ్ తో భవిష్యత్ ప్రణాళికల గురించి కూడా మాట్లాడుతున్నారని ఇటీవలి కాలంలో వార్తలు రావడం మొదలైంది. అయితే ఇప్పుడు రేణుదేశాయ్ ఇంట్లో ఒక చిన్న కార్యక్రమానికి కూడా పవన్ కళ్యాణ్ వెళ్లడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని గతంలో కంటే ఇప్పుడు ఆమెతో మరింత సన్నిహితంగా ఉంటున్నారని అంటున్నారు. రేణుదేశాయ్ ఎంగేజ్మెంట్ చేసుకునే అవకాశం ఉన్నా సరే మొన్నామధ్య క్యాన్సిల్ కావడం వెనక పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారనే ప్రచారం కొంతమంది చేశారు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాలతో బిజీగా ఉన్నా సరే వ్యక్తిగత జీవితం మీద అలాగే తన పిల్లలకు కెరీర్ మీద కాస్త ఎక్కువగా ఫోకస్ చేశారని త్వరలోనే తన కుమారుడు విదేశాలకు వెళ్లే అవకాశం ఉందనే వార్తలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల మీద కూడా ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో కొంతమంది నిర్మాతలు ఆయనకు అడ్వాన్స్ ఇచ్చి ముందుకు వెళ్లేందుకు వెనక అడుగు వేస్తున్నారని అంటున్నారు. మరి భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ సినిమాల మీద రాజకీయాల మీద వ్యక్తిగత జీవితం మీద ఎంత వరకు ఏ విధంగా ఫోకస్ చేస్తారు అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: