టాలీవుడ్‌ టాప్ హీరో ఎవరు అంటే ఇప్పటికీ కొన్ని క్వశ్చన్ మార్క్స్‌ కనిపిస్తూనే ఉంటాయి. రకరకాల పేర్లు తెరమీదకొస్తాయి. అయితే ఇప్పడీ క్వశ్చన్ మార్కులు, సందేహాలు అక్కర్లేదని ప్రూవ్ చేస్తున్నాడు ప్రభాస్. బాలీవుడ్‌ నంబర్స్‌తో టాలీవుడ్‌ టాప్‌ చైర్‌ని అందుకుంటున్నాడు బాహుబలి. చిరంజీవి సినిమాల్లో బ్రేక్‌ తీసుకున్న తర్వాత టాలీవుడ్ టాప్ ఛైర్ కోసం పవన్ కళ్యాణ్ పోటీ పడ్డాడు. మహేశ్‌ బాబు కూడా నంబర్‌గేమ్‌ దూకుండు చూపించాడు. అయితే పవన్‌ 'అజ్ఞాతవాసి' తర్వాత సినిమాలకి బ్రేక్ ఇచ్చి పాలిటిక్స్‌లోకి వెళ్లిపోయాడు. ఇక మహేశ్‌ బాబు వరుసగా భారీ బ్లాక్‌బస్టర్స్ సాధించలేదు. దీంతో నంబర్ వన్‌కి కొంచెం దూరంగానే ఉన్నాడు.

'బాహుబలి' తర్వాత ప్రభాస్‌ ఇమేజ్‌ మారిపోయింది. భారీ పీరియాడికల్ డ్రామాగా రూపొందిన ఈ మూవీతో నార్త్‌లో కూడా ప్రభాస్‌కి క్రేజీ ఫాలోయింగ్‌ వచ్చింది. సాలిడ్‌ మార్కెట్‌ కూడా దొరికింది. అందుకే 'సాహో'కి తెలుగునాట మిక్స్‌డ్‌ రెస్పాన్స్ వచ్చినా, నార్త్‌లో 150 కోట్లకి పైగా కలెక్షన్లు వచ్చాయి. హిందీ నిర్మాతలు కూడా ప్రభాస్‌తో వరుస సినిమాలు నిర్మిస్తున్నారు.

బాలీవుడ్‌ స్టార్ ప్రొడక్షన్‌ హౌజ్ టీ-సీరీస్‌లో ప్రభాస్‌ వరుస సినిమాలు చేస్తున్నాడు. ఈ బ్యానర్‌లో 'ఆదిపురుష్'తో పాటు 'స్పిరిట్' సినిమా కూడా చేస్తున్నాడు. ప్రభాస్‌ 25వ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ 'స్పిరిట్'కి 150 కోట్లు ఇస్తున్నారట నిర్మాతలు. ఇప్పుడు సెట్స్‌లో ఉన్న ప్రాజెక్ట్స్‌కి 100 కోట్లు తీసుకుంటోంటే, ఇక మీదట సైన్‌ చెయ్యబోయే సినిమాలకి 150 కోట్లు చార్జ్‌ చేస్తాడట.

తెలుగులో ఇప్పటివరకు ఏ హీరో కూడా 100 కోట్ల రెమ్యూనరేషన్‌ మార్క్‌ని చేరుకోలేదు. పవన్, మహేశ్ లాంటి స్టార్లు 50 కోట్ల దగ్గరే ఉన్నారు. బాలీవుడ్‌లో ఖాన్ త్రయం 100 కోట్లకి పైగా చార్జ్‌ చేస్తున్నారు. తమిళ్‌ రజనీకాంత్‌ ఎప్పుడో 100 కోట్లు క్రాస్‌ చేశాడు. ఇప్పుడు ప్రభాస్‌ ఇంత మొత్తం వసూల్‌ చేస్తున్నాడు. దీంతో ప్రభాస్‌ నంబర్‌ వన్ స్టార్‌ అనే కామెంట్స్‌ స్టార్ట్ అయ్యాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: