పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మూడేళ్ళ క్రితం రిలీజ్ అయిన సినిమా అజ్ఞాతవాసి. త్రివిక్రమ్ తీసిన ఈ సినిమా బాక్సాఫిస్ దగ్గర ఘోరంగా బోల్తా కొట్టింది. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై పవన్, త్రివిక్రమ్ ల కాంబోలో తెరకెక్కిన అజ్ఞాతవాసి పై పవన్ ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ ఆడియన్స్ లో కూడా ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఫైనల్ గా ఈ మూవీ ఫ్లాప్ అవడం, ఆ తరువాత పవన్ పూర్తిగా తన రాజకీయాల్లోకి వెళ్లిపోవడం జరిగింది. అనంతరం మూడేళ్ళ తరువాత ఈ ఏడాది వకీల్ సాబ్ సినిమా ద్వారా ప్రేక్షకాభిమానులు ముందుకు వచ్చారు పవన్ కళ్యాణ్.

వేణు శ్రీరామ్ తీసిన సినిమాలో పవన్, సత్య దేవ్ అనే లాయర్ పాత్ర చేయగా అంజలి, నివేతా థామస్, అనన్య, ప్రకాష్ రాజ్, తదితరులు ఇతర పాత్రలు చేసారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి థమన్ సంగీతం అందించారు. అంతకముందు హిందీలో అమితాబ్ ప్రధాన పాత్రలో నటించిన పింక్ కి అఫీషియల్ రీమేక్ గా రూపొంది రిలీజ్ తరువాత సూపర్ హిట్ కొట్టింది వకీల్ సాబ్. కాగా ఈ సినిమాని అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునేలా అలానే మన తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా ఎంతో బాగా తీసి ఆకట్టుకున్నారు దర్శకుడు వేణు శ్రీరామ్.

ఇక మూవీకి థమన్ అందించిన సాంగ్, బీజీఎమ్ ఎంతో పెద్ద ప్లస్ కాగా లాయర్ పాత్రలో తన మార్క్ పెర్ఫార్మన్స్, స్టైల్, ఫైట్స్, యాక్షన్ తో అందరినీ ఎంతో ఆకట్టుకున్నారు పవర్ స్టార్. ఆ విధంగా కెరీర్ పరంగా కొంత గ్యాప్ తీసుకున్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్, వకీల్ సాబ్ ద్వారా సూపర్ హిట్ సొంతం చేసుకున్నారు అనే చెప్పాలి .ఇక ప్రస్తుతం పవన్ నటిస్తున్న భీమ్లా నాయక్ మూవీ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: