బాలకృష్ణకు ఈ చిత్రం విజయం మర్చిపోలేనిది. చాలా రోజుల తర్వాత ఈ సినిమా ద్వారా మంచి హిట్ కొట్టిన అయన ఈ చిత్రం విజయం సంతృప్తి ని ఇవ్వడమే కాకుండా నందమూరి అభిమానులకు సరికొత్త సంతోషాన్ని నెలకొల్పింది. సినిమా ఇప్పటికీ హౌస్ ఫుల్ అవుతూ కలెక్షన్ ల పరంగా దూసుకుపోతుండగా బాలకృష్ణ కు చాలా రోజుల తర్వాత హిట్ పడడంతో దానికి తోడు తెలుగు సినిమా పరిశ్రమకు అవసరమైన హిట్ పడటంతో అందరికీ బాలకృష్ణ పట్ల ఒకరకమైన మంచి అభిప్రాయం ఏర్పడింది. ఇక తాజాగా ఆయన తన మనసులోని కోరికను బయటకు చెప్పడం అందరినీ ఎంతగానో ఆశ్చర్యపరుస్తుంది. అది ఏమిటంటే బాలకృష్ణకు విలన్ గా నటించాలనే కోరిక ఉందట.
ఏదైనా మంచి సినిమాలో విలన్ గా నటించి పరిపూర్ణ నటుడిగా అనిపించుకోవాలని ఆయన అనుకుంటున్నాడట. మరి బాలకృష్ణ ను అద్భుతంగా తెరపై చూపించే బోయపాటి శ్రీను ఆయన సినిమాల్లో విలన్ పాత్రలను కూడా హీరో కి తగ్గట్టుగా డిజైన్ చేసి ప్రేక్షకులకు థ్రిల్ కలిగించే వాడు. ఈ నేపథ్యంలో అయన చేయబోయే సినిమాలలో విలన్ పాత్రను సృష్టించి ఆయనకు పుట్టిన ఈ కోరిక తీరుస్తారా అనేది చూడాలి. ఎలాగో బోయపాటి శ్రీను బాలకృష్ణతో కలిసి నాలుగో సినిమా కూడా చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. ఈ చిత్రంతో ఆ కోరిక నెరవేరుస్తాడా అనేది చూడాలి.