టాలీవుడ్ సినిమా పరిశ్రమలో యువ హీరోల హవా కొనసాగుతూనే ఉంది. కొత్త హీరోలు వచ్చి తమ టాలెంట్ ను ప్రదర్శించి సినిమాలు చేసుకుంటూ పోతుంటే ఓ మోస్తరు స్థాయిలో రాణించిన హీరోలు కూడా మంచి సినిమా లతో రాణిస్తున్నారు. స్టార్ హీరోలు మాత్రమే కమర్షియల్ సినిమాలు చేస్తుండగా యువ హీరోలు అందరూ కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలను చేస్తూ తమను తాము నిరూపించుకునీ ప్రేక్షకులకు కొత్త రకమైన సినిమా లను అందజేస్తున్న కాన్ఫిడెన్స్ లో వారు ఉంటున్నారు.  

ఆ విధంగా చలో దిక్కులు చూడకు రామయ్య వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన హీరో నాగ శౌర్య ఇప్పుడు సరికొత్త అవతారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన హీరో గా నటించిన లక్ష్య అనే సినిమా ఈ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతు ఉండగా ఈ చిత్రం ప్రేక్షకులను ఏ విధంగా అలరించబోతోంది అనేది ఇప్పుడు అసలు విషయం. గత కొన్ని సినిమాలతో ప్రేక్షకులను ఖుషి చేయలేకపోతున్నాడు నాగశౌర్య. ఆయన ఏ సినిమా చేసినా కూడా అది ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ కాలేకపోవడం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ కావడం వంటివి జరుగుతున్నాయి. దాంతో ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలని భావించి లక్ష్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాగశౌర్య ఆర్చర్ గా కనిపించబోతున్నాడు. ఇప్పటి వరకు ఆయన చేయనటువంటి పార్టీ లో కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ప్రయత్నాలు చేస్తుండగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ మరియు ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచాయి.  ఈ నేపథ్యంలో వాటికి తగ్గట్టుగా ఈ సినిమా ఉంటుంది అనేది చూడాలి. మరి నాగ సూర్య ఎన్నో నమ్మకాలు పెట్టుకున్న ఈ సినిమా డిసెంబర్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా రొమాంటిక్ భామ నటించడం మరొక విశేషం. రొమాంటిక్ సినిమాతో ప్రేక్షకులను ముగ్ధులను చేసిన ఈమె కు మంచి ఫ్యాన్ బాస్ ఏర్పడింది. మరి ప్రేక్షకులు ఈ చిత్రం ను ఏ లెవెల్లో విజయం చేస్తారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: