సినీ ఇండస్ట్రీలో ఎంత మంది హీరోయిన్స్ ఉన్నా వాళ్లందరిలోకి నయనతార కొంచెం ఢిఫరెంట్ అని చెప్పాలి. ఎందరో కుర్ర హీరోయిన్ లు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న ఈమె స్దానాని మాత్రం మార్చలేకపోతున్నారు. అందం విషయంలోను, నటన పరంగా కూడా అమ్మడుని ఢీ కొట్టే వాళ్ళు ఇప్పుడు లేరు. ఇక్కడ మనం ముఖ్యంగా నయనతార గురించి చెప్పుకోవాల్సింది స్టోరీలు చూసింగ్ గురించి..ఆమె కధలు సెలక్ట్ చేసుకునే విధానం అందరికి నచ్చుతుంది. ప్రతి సినిమాలో కొత్తగా కనిపించేలా అందరిని తన నటనతో ఫ్లాట్ చేస్తుంది ఈ హాట్ బ్యూటీ.

కాగా ఈమె స్టోరీ చూసింగ్ లోనే కాదు రెమ్యూనరేషన్ విషయంలోను పక్కాగా ఉంటుంది. ఆమె అడిగినంత పారితోషకం ఇవ్వకపోతే నయనతార కు ఎంత నచ్చిన కధ అయిన సరే ఆమె ఒప్పుకోదు. అంత మొండి గా ఉంటుంది డబ్బు విషయం లో నయనతార. ఇక నయనతార డిమాండ్స్ ఎలా ఉంటాయి అంటే. ఒక సినిమాలో కేవలం నాలుగు సీన్ల లో కనిపించేందుకు అమ్మడు ఏకంగా  5 కోట్లు అడిగిందట ప్రోడ్యూసర్స్ ని. ఈ విషయం నెట్టింట తెగ వైరల్ అయ్యింది.

నయనతార గత ఏడాది కోలివుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ తో కలిసి  దర్బార్ అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో ఆమె మనకు కేవలం నాలుగు సీన్ల లోనే కనిపిస్తుంది. దీని కోసం అమ్మడు  ప్రోడ్యూసర్స్ ని ఏకంగా 5 కోట్లు డిమాండ్ చేసి.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఆమెకు ఉన్న డిమాండ్ బట్టి నిర్మాతలు కూడా నయన్ అడిగినంత ఇవ్వడానికి ఓకే చెప్పారట. దీని బట్టి నయనతార రేంజ్ ఏలా ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు. కాగా, వచ్చే ఏడాది తన ప్రియుడు విగ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉంది నయన్.
 

మరింత సమాచారం తెలుసుకోండి: