ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ట్వీట్ వైరల్ అవుతోందని సమాచారం."దేవుడు మరియు అమ్మ సాక్షిగా చెప్తున్నా. 'పుష్ప' సినిమా ఏదైనా తేడా కొడితే రిలీజ్ రోజునే నా చావు చూస్తారు" అంటూ అల్లు అర్జున్ వీరాభిమాని ఒకరు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోందని తెలుస్తుంది.

ఇదంతా "పుష్ప" ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత జరిగిన పరిణామం అని "ట్రైలర్ చూసి నా మనసు చచ్చిపోయిందని ఇంకా నా వల్ల కాదు, ఇన్ని రోజులు చాలా గౌరవం ఇచ్చి సుకుమార్ పైన ట్వీట్స్ వేసాను గుడ్ బై ట్విట్టర్. లవ్ యు అల్లు అర్జున్" అంటూ ఈ ట్వీట్ లో పేర్కొన్నదట.

ఈ ట్వీట్ పట్ల అభిమానుల్లో మిశ్రమ స్పందన లభిస్తోందని ఇంత అభిమానం సొంతం చేసుకోవడం హీరోలు చేసుకున్న పుణ్యం అయితే, శృతిమించిన ఫ్యానిజం ఎంతటి ఆలోచనలకు తీసుకువెళ్తుందో అన్న దానికి నిదర్శనంగా ఈ ట్వీట్ ను పేర్కొంటున్నారట.

'పుష్ప' అనేది కేవలం ఒక సినిమా మాత్రమేనని అన్ని సినిమాల మాదిరి "పుష్ప" కూడా హిట్ కావచ్చు లేదా కాకపోవచ్చు. అందరి హీరోలకు హిట్ - ప్లాప్ లు రెండు ఉంటాయని అంత మాత్రాన ఇలా చచ్చిపోతాను అనే దాకా వెళ్లడం అనేది అపరిపక్వతను సూచిస్తోందని తెలుస్తుంది.

ఈ ఐడిలోని గత ట్వీట్లు చూస్తే ముఖ్యంగా "పుష్ప" ట్రైలర్ కు జరిగిన ఆలస్యం మరియు ట్రైలర్ ఆశించిన రీతిలో లేకపోవడంతో కలత చెందినట్లుగా అర్ధమవుతోందని తెలుస్తుంది.ముఖ్యంగా చిత్ర నిర్మాణ సంస్థపై మిక్కిలి కోపంతో ఉన్నట్లు 'మొత్తం నాశనం చేసారు' వంటి ఇంతకుమునుపు ట్వీట్స్ చెప్తున్నాయట.

అలాగే ట్రైలర్ రిలీజ్ అయిన రోజు భోజనం కూడా చేయకుండా ఉండడం అలాగే రిలీజ్ అయిన తర్వాత 'ట్రైలర్ అలా ఉంటే మూవీ చూసాకా నిన్ను మరిచిపోతానేమో అని భయం వేస్తోంది చాలా చాలా ఏడుపు వస్తుంది' అంటూ ట్వీట్స్ చేయడం వంటివి బహుశా బన్నీ మీద అభిమానానికి తార్కాణంగా పేర్కొనవచ్చట 

ఏది ఏమైనా అభిమానానికి కూడా హద్దులు ఉండాలని ఇలాంటి ట్వీట్స్ చూసినపుడు అందరికి అనిపిస్తుందట.ఒక్క ట్రైలర్ సరిగా లేకపోతే ఏకంగా జీవితాన్నే కోల్పోవాలనే దృక్పధం ఏ మాత్రం హర్షించదగ్గ విషయం కాదని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: